కవిత: ఆకాశం హరివిల్లు

poem

Update: 2023-02-05 18:30 GMT

రంగులను రంగరించి.

మబ్బులను కరిగించి.

నీకోసం ఆకాశం హరివిల్లైందిగా......

ఎన్నడూ ముస్తాబు కాని ఆకాశం

నీకోసం ముద్దుగా ముస్తాబై వచ్చేసిందిగా......

మోడువారిన ఆ చెట్టే నీకోసం చిగురిస్తోందిగా!

అలక మాని బయటికి రావే

పండు వెన్నెల నీకోసం పరిణమిల్లుతుందిగా!!

చెట్టుకు చీర కట్టి, ముట్టుకు మురిసిపోయే నాకే

చెట్టు కన్న పచ్చదనం, చిలక కన్న చిలిపి దనం,

సంబరం దొరికిన ఈ వేళ!!

కళ్ళు తెరవగానే కల అయిపోయెనా!!

జక్కుల శ్రీనివాస్

9701938358

Also Read..

కవిత: విముక్తి పయనం!!  


Tags:    

Similar News

పిల్లలంటే!