కవిత: ప్రతిబింబం

poem

Update: 2023-02-05 18:30 GMT

తను లేని నేను లేను

నేను లేని అతను లేడు

ఆనందం కొంచెం పాళ్ళు

దుఃఖం జీవితకాలం.

నువ్వులేని నేను లేనని

నీకే నన్ను ఇచ్చా నన్నాడు

బాస చేసుకున్నాము.

మనసును ముడి వేసుకున్నాము

మాకు ప్రతిబింబాలు కరిగి

రక్తపు మడుగులైన

ఇంకరావని, రారని తెలుసుకుని

చంటిబిడ్డలమై మేమే మరిపించుకున్నాం.

అడుగులు కలసిన ఏడడుగులు

బాసలమాటున బంధాన్ని బలిష్టంచేసాము

విడిపించ మాటల తరమౌనాయని

పుష్యమిసాగర్ 

79970 72896

Also Read..

కవిత: కళా తపస్వి 


Tags:    

Similar News

పిల్లలంటే!