శబ్ద స్ఫూర్తి సినారె కవితా సృష్టి

Update: 2022-07-31 19:30 GMT

అతడు 

అక్షరాల తోటలో వాడని పువ్వు

పరిచిన పరిమళం మట్టి మనిషి

ఆకాశం అంచులు దాటిన కవిత

అతడేగా

నాగార్జున సాగరమై ప్రవహించిన

గేయ కావ్య బుద్ధుడు

కర్పూర వసంత రాయలు పలికిన

లకుమాక్షర సుందర గేయ బద్ధుడు

చరిత్ర లిఖించిన కావ్య లేఖిని శబ్ద స్ఫూర్తి 

అతడే గదా

విశ్వ వీణపై మనిషిని నిలిపి

విశ్వంభర కావ్యసృష్టిని మీటినాడు

ప్రకృతి ప్రేమతో అక్షర గవాక్షాలు తెరిచి

ప్రపంచపదుల గేయకావ్యామృతం

విశ్వ వీధులందాలపించినవాడు

అతడే గదహో

గాలిబ్ గజల్ ప్రేమ గీతాలవోలే

సినారె గజళ్ళు స్నేహ భావాలు రాసే

అమ్మ ఘనతను నొక్కి నొక్కి చెప్పినాడు

పసుల పోచమ్మతో పలికిన కలం అక్షర సిరి మూలవాగు ఊట

వ్యసోపన్యాసాల హన్మాజిపేట రాత 

మంటలు మానవుని తాకిన కవి కొండ

అక్షరాల కర్పూర కవిత్వ దండ సినారె

జలపాతాలు హొయలతో దూకితే

జ్వలపాతాలు పుట్టించే ఉష్ణతాపం

సినారె కవితా సృష్టి 

నదులు, ప్రకృతి,కవితా ప్రేమలతలై

పరుచుకొన్నది సినారె కళా హృదయం

అతడే జయహో

బుచ్చమ్మ కొంగు బంగారు అక్షర ఉలి

మల్లన్న చూపు నేత్రం కావ్యమాలలై

ఒదిగి ఎదిగిన భారతీయ జ్ఞానపీఠం

కరీంనగర్ మట్టి నడిచిన అక్షర పాదాలు

భాగ్యనగర ఘన సాహితీ సిగలో తురిమిన మరుమల్లె సిరిమల్లే 

మానవీయ మహా కవి సినారె

అతడే ఔనౌనహో

పదవులెన్ని పొందిన గానీ

విద్యా విశారద శరధి సినారె

తృప్తి దీప్తులు దశదిశ వ్యాపించ

గురుపీఠమెక్కిన సామాన్యుడు

శిశ్యప్రశిశ్యులతోడ అసమాన్యడు

తపన బోధనయందు మెరిసి నిలిచే

'సమగ్రాంధ్ర సాహిత్యము సంప్రదాయాలు, ప్రయోగాలలు'   

 పరిశోధనలో ఉద్గ్రంధ శోధనై వెలిగే

ప్రామాణిక పరిశోధక సాహిత్య గవాక్షం

విశ్వ విను వీధుల్లో రెపరెపలాడే 

 తెలుగు సాహితీ శిరశ్శిఖరం ఊపిరి

అతడే సినారే 

చిత్రం భళారే విచిత్రం

పగలే వెన్నెల జగమే ఊయల

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, 

 తోటలో నా రాజు 

 ఒంపు ఒయ్యారాలు ఒంపిన

 శ్లిష్ట సినీ గీతాలెన్నో అలా..అలా..

నిన్నటి అందాలను నిదురలేపే నేటికీ సినీ వినీలాకాశంలో

ఆడవే మయూరీ, శివరంజనీ

సుధా రాగసుధా అనురాగసుధా,

సంగీత సాహిత్య సమలంకృతే

స్వరం రాగ పదయోగ సమభూషితే

పద పదంలో కావ్య భాష ముద్ర   

 వెలిగించిన సాహితీ వల్లభుడు సినారె

బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె భువిని గాలిలో నడయాడె కావ్యమై 

డా. టి. రాధాకృష్ణమాచార్యులు

9849305871

Tags:    

Similar News

పిల్లలంటే!