యదార్థం

Update: 2022-05-01 19:00 GMT

జాబిల్లి సిగ్గు పడుతోంది

నిస్సిగ్గుగా విలువలనెడి వలువలను

వదిలేసి వెకిలి చేష్టలు చేస్తూ

వయ్యారాలు పోతున్న వగలమారి లోకులను చూసి

తారలు తల్లడిల్లిపోతున్నాయి

పట్టపగలు పగలబడి నవ్వుతూ

వెటకారపు ఈటెల వంటి మాటలతో

మనిషిని మనిషి హింసించుకోవటం చూసి

సాగుతున్న సెలయేరు ఆగిపోయింది

కొనసాగుతున్న కౄర చర్యల్ని

నిత్యం మోసాలు, ద్రోహాలతో సాగిపోతున్న

సమాజపు నూతన పోకడలకు నివ్వెరపోయి

పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి

ధనార్జన పేరిట దగాలు దౌర్జన్యాలు

సేవ పేరుతో సాగే ముసుగు చర్యలు

పైపూత బంధాల లోగుట్టు గ్రహించి వల్ల కాదంటూ

నీలాకాశపు నింగి ఎర్రబడింది

నోటితో పొగిడి నొసటితో వెక్కిరిస్తూ

ముందు మురిపించి వెనుక ఎత్తివేసే

మనుషులకంటిన మలినాలను చూసి భీతిల్లి...!!


ఎస్. వినోద్‌కుమార్

హన్మకొండ

99083 12949

Tags:    

Similar News

పిల్లలంటే!