అంతరంగం: మనసు మన మాట వినాలి

antarangam

Update: 2023-01-01 19:15 GMT

సమీక్షించుకుంటే మళ్లీ గతంలాగా చేయలేం. పద్ధతులను, మాటలను, పనులను, మర్యాదలను తప్పనిపిస్తే నీకు నీవే మార్పు చేసుకోవాలి. నిజానికి కరెక్ట్ ఏదీ కాదు తప్పు ఎక్కడ జరిగింది, సత్ప్రవర్తన ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. ఆ స్పృహలోనే ఉండాలి. అయితే, ఇవన్నీ రానున్న రోజుల్లో మార్పు తెచ్చుకుంటాను అనే బలమైన విశ్వాసం మనస్సుకు తట్టేట్టు నాటాలి. అప్పుడే నవ్య మానవత్వం వస్తుంది. ఏది ఏమైనా ఎదుటి వాళ్లను వాళ్ల కోణం నుంచి కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి వాళ్లదే తప్పు కావచ్చు రైట్ కావచ్చు నిష్కామంగా ఆలోచించగలిగితే అర్థం అవుతుంది. అప్పుడే మనసు తేలిక అయి గాలిలో ఊయలలు ఊగవచ్చు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు నిరంతరం ఉత్సవ స్ఫూర్తితో కొనసాగాలని కోరుకుందాం.

కాలం కరిగి పోతూనే ఉంటుంది. జీవితం జరిగిపోతది. క్యాలెండర్ పుటలు పుటలుగా మారి పన్నెండో నెల తర్వాత కొత్తది గోడకు వేలాడుతది. మాసాలు మారినట్టే రుతువులూ తిరుగుతుంటాయి. మనుషులంతా మారిపోతారు. ఆలోచనలూ మారిపోతాయి జీవితంలో కొంగొత్త మార్పులు వస్తాయి. వృత్తి, ఉద్యోగంలోనూ నూతనత్వం వస్తుంది. మార్పు అనివార్యం కాలం కదలడం భూమి తన చుట్టూ తాను తిరిగినట్టే జరిగిపోతుంది. ఒక సంవత్సరం మనిషికి ఒక మైలురాయి పుట్టినరోజు నుంచి మళ్లీ పుట్టిన రోజు వరకు లేదా క్యాలెండర్ ఇయర్ వరకూ ఒక గీటురాయి. ప్రపంచం మొత్తం మీద సకల జీవరాశులు జంతు జాలాలు కూడా కాలానుగుణంగా మార్పులకు లోనవుతారు అది కాల మహిమ.

ఆధునిక మార్పులు వస్తూ

మనిషి కూడా బిగుసుకుని కూర్చోవద్దు. మార్పును ఆహ్వానించాలి. పాత నుంచి కొత్తది వస్తది. తరతరాల సంప్రదాయం నుంచి నవ్య సంప్రదాయం ఉత్పన్నం అవుతది. అంతా అట్లనే పాత లెక్కనే ఉండాలి అంటే కుదరది. పాత పద్ధతిలోనే జీవిస్తాం అంటే మానసిక ఘర్షణలు మొదలవుతాయి. ఎందుకంటే పాత వృత్తులు లేవు, మారిపోయాయి. పాత చదువులు లేవు అవి మారిపోయాయి. మానవ సంబంధాలలోనూ మార్పులు పొడసూస్తున్నయి. మనిషి ఆహారం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నిట్లోనూ ఆధునికత వచ్చింది. నిరంతరం మారుతున్న మార్పును ఆహ్వానించడం దాంతో కల్సి నడవడమే నవీన మానవుడు చేయాల్సిన చర్య.

అదే బాటలో నడుస్తూ

మనిషి సహజంగానే ప్రశ్నించడం తెలుసుకోవడం, అక్కరలేని దానిని ధిక్కరించడం, అవసరమైన దానిని అన్వయించుకోవడం జరిగిపోతున్న విద్యనే. కానీ, మైండ్ ట్యూనింగ్‌కు గురి అవుతది. 'ఇది ఇట్లనే ఉండాలి. ఇది ఇంతే ఇట్లనే ఆలోచించాలి. మన పూర్వం ఇట్లనే ఉన్నది. మనము అట్లనే అదే బాటలోనే నడుస్తాం'అనేది మనసుకు రుద్దంగ రుద్దంగ అదే ఎక్కుతది. అప్పుడే అసొంటి మనిషి అక్కన్నే ఆగిపోతడు. మనిషి అంటే ఒక్కడే కాదు, కుటుంబం, సంఘం, సమాజం, కార్యక్షేత్రం అన్నింటిలోనే మనిషి ప్రస్తానం కొనసాగుతది. అప్పుడే ఆలోచనల తేడాతో అర్థం చేసికునే చైతన్యంలో ఎదురుకొడుతది.

ఎవరికి వారే మారాలి

కొత్త తరంలో ఇవన్నీ లేవు అని కాదు, ఉన్నాయని కాదు, చైతన్య స్థాయిని బట్టి జీవితాన్ని గొప్పగా జీవిస్తున్నారు. ఎంత సంపాదించినా ఎంత వ్యాపారం చేసినా జీవితాన్ని నందనవనం చేసికోవడం మిన్న. మనిషికి మనిషి మధ్య నెలకొన్న ప్రేమపూరిత మానవ సంబంధాల నిర్వహణ ముఖ్యం. తదనంతర కాలంలో ఎందరు కన్నీళ్లు రాలుస్తారు, ఎందరు మనసును తడి చేసుకుంటారనే దానిపైనే ఉంటుంది. కొత్తగా ఒక కాల మార్పు వస్తుందనుకుంటే, ఒకసారి ఎవరికి వారే సమీక్ష చేసుకోవాలి. ఎవరి ఆత్మతో వాళ్లే కొత్త సంవత్సరం సందర్భంలో మాట్లాడుకోవాలె. తాను గడిచిన రోజుల్లో ఎవరినైనా పరుషంగా మాట్లాడి మనసు నొప్పించానా! ఎవరికైనా కన్నీళ్లు పెట్టించానా లేదా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రవర్తించాల్సిన పద్ధతి తప్పి ప్రవర్తించానా? అనే సమీక్షలు అవసరం. ఎవరి ఆత్మ వాళ్లకు సాక్షి. మాటలు సందర్భాలు ప్రవర్తనలు రకరకాల వత్తిడుల వల్ల వస్తుంటాయి.

సమీక్షించుకుంటే మళ్లీ గతంలాగా చేయలేం. పద్ధతులను, మాటలను, పనులను, మర్యాదలను తప్పనిపిస్తే నీకు నీవే మార్పు చేసుకోవాలి. నిజానికి కరెక్ట్ ఏదీ కాదు తప్పు ఎక్కడ జరిగింది, సత్ప్రవర్తన ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. ఆ స్పృహలోనే ఉండాలి. అయితే, ఇవన్నీ రానున్న రోజుల్లో మార్పు తెచ్చుకుంటాను అనే బలమైన విశ్వాసం మనస్సుకు తట్టేట్టు నాటాలి. అప్పుడే నవ్య మానవత్వం వస్తుంది. ఏది ఏమైనా ఎదుటి వాళ్లను వాళ్ల కోణం నుంచి కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి వాళ్లదే తప్పు కావచ్చు రైట్ కావచ్చు నిష్కామంగా ఆలోచించగలిగితే అర్థం అవుతుంది. అప్పుడే మనసు తేలిక అయి గాలిలో ఊయలలు ఊగవచ్చు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు నిరంతరం ఉత్సవ స్ఫూర్తితో కొనసాగాలని కోరుకుందాం.

అన్నవరం దేవేందర్

94407 63479

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

సమీక్ష: ఆర్తి సముద్ర కెరటం

Tags:    

Similar News

పిల్లలంటే!