అంతరంగం: పోలీసు సేవలన్నీ అందుకేనా!?

antarangam

Update: 2022-12-11 19:15 GMT

దారులన్నీ బంద్ చేసి వీఐపీ వాహనాలను పంపడం, ట్రాఫిక్ జాం చేయడం ఇబ్బంది. అంతిమంగా ఇట్ల ఎందుకు చేస్తున్నారంటే ఏం అర్థం కాదు. అట్లాగే ప్రతిపక్ష నాయకులను ఇండ్లల్ల నిర్బంధించడం బయటకు రాకుండా చేయడం నిరసన కూడా తెలపకుండా చేయడం కూడా చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రజలు ఏం అనుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎట్లా తెలుస్తుంది. నిరసన రూపంలోనే కదా మన తెలంగాణ వచ్చింది. అంతటా ప్రజలు రహదారుల మీదకి వచ్చి ఎన్ని నిరసనలు ర్యాలీలు చేయలేదు. అదొక ప్రజాస్వామిక డిమాండ్. ఇప్పుడు మరో దానికి తావు లేకుండా నడుస్తుంది. ఈ కాలం పోలీసులకు పౌరులతో సంబంధాలు ఇది వరకు కన్నా స్నేహపూర్వకంగానే ఉన్నాయి. కానీ, సేవలన్నీ బందోబస్తు ప్రదర్శనకే సరిపోతున్నాయి.

పోలీసు ఉద్యోగాల ఎంపికకు యువతీ యువకులు ఎంత కష్టపడుతున్నారో వాళ్లు శిక్షణ పొందుతున్న మైదానాలు చూస్తే తెలుస్తుంది. ఉదయం, సాయంత్రం దాదాపు ఆరేడు గంటలు రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ శిక్షణలో శీతాకాలంలోనూ చెమటలు కక్కుతున్నారు. ఈ పరీక్షలలోకి వస్తున్నది దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్లు. ఎట్లాగూ సంపన్న కుటుంబాల పిల్లలు ఇంజినీరింగ్ విద్యలు అభ్యసించి సాఫ్ట్‌వేర్ ఇతర ఉద్యోగాలలో సెటిల్ అవుతారు. లేదా ఇతర వైట్ కాలర్ ఉద్యోగాలలోకి వెళుతారు.

ఈ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికైతే పల్లె కూలి కైకిలి వ్యవసాయ కుటుంబాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ఉన్న ఉద్యోగాలు కూడా పోలీస్ శాఖలోనే. తెలంగాణ తెచ్చుకున్నంక సర్కారుకు పోలీసుల అవసరమే ఎక్కువ అవుతుంది. ఉపాధ్యాయ ఇతర బోధన రంగం విద్యారంగం పూర్తిగా వెనుకకు వేస్తున్నారు. పోలీసు ఎంపిక కఠినంగా జరుగుతుంది. కొన్ని నెలలు నగరాలలో ఉండి ప్రస్తుతం చదువుకుంటున్న చదువులు ఆపి శిక్షణలో ఉంటున్నారు. వాళ్ళకు రన్నింగ్ 1600 మీటర్లు లాంగ్ జంప్ దునకడం ఉంటుంది. ఈ దేహాదారుఢ్య పరీక్షకు వచ్చే ముందే ఒక ప్రిలిమినరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. తర్వాత దేహదారుఢ్యం. ఇందులో విజయం సాధిస్తే మెయిన్స్ పరీక్ష. దాని తర్వాత ఇక పోలీస్ డ్రెస్.

నేటి యువత కలలు ఇవి

పోలీస్ డ్రెస్ వేసుకోవడం కోసం ఈనాటి యువతరం కల కంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ జిల్లాలలో పోలీసు ఉద్యోగం ఒక భయానక వాతావరణంలో ఉండేది. పౌరులతో పోలీసుల ప్రవర్తన కూడా రాష్‌గా ఉండటం, నక్సలైట్ ఉద్యమ వాతావరణంలో ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తిని తగ్గింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం లేదు. అంతా 'స్మార్ట్' తోనే నేరాలు పట్టే పరిస్థితి వచ్చింది. నిజానికి నేరాలు ఇదివరకున్నంత అయితే లేవు. తాళం పగులగొట్టి ఇండ్లు లూటీ చేయడం లేదు. ఊర్లల్ల కొట్లాటలు కూడా లేవు. రాజకీయ ఘర్షణలు కూడా తక్కువనే కానీ, ఏం జరిగినా సీసీ కెమెరాలు, వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్‌తో అన్ని నేరాలను పట్టుకోవచ్చు. ఈ కాలం నేర ఎలక్ట్రానిక్ సాంకేతిక పరిశీలనలో సులువు అవుతుంది. అందుకే హత్యకేసులో, అత్యాచారం కేసులో ఇప్పుడు ఒక్కరోజులో దొరుకపట్టే సాంకేతికత వచ్చేసింది. అట్లాంటి పరిశోధన చేయడం కూడా ఈ నాటి యువతరానికి సులువు అవుతుంది.

నేరాలు, దర్యాప్తూ స్మార్ట్ గానే

మనిషి కదలికలను కనిపెట్టే స్థితి వచ్చింది. అందుకే ముడుపుల ఎమ్మెల్యేల అమ్మకం లాంటి ఎన్నో కేసులు తీగ లాగకముందే వస్తున్నాయి. పోలీసు శాఖకు ఇప్పుడు ఇదివరకు ఉన్నంత పనిలేదు. ఏది జరిగిన డేటా విశ్లేషణతోనే సరిపోతుంది. ఫోన్, కెమెరాలు ప్రతి ఒక్కరి సంభాషణలు పట్టే జ్ఞానంతోనే తనకు తానే నేరస్తుడు దొరకుతున్నాడు. అయితే ఇవన్నీ కోర్ట్‌కు సాక్ష్యం నిరూపించడం కోసం ప్రయత్నించాలి. ఇట్లా చాలా కేసులు చేధిస్తున్నారు. మరి ఇంత మంది పోలీసులకు ఏం పని? నిజానికి ఇన్ని వేల ఉద్యోగాలు అవసరమా? అన్పిస్తుంది.

బందోబస్తు పేరు మీద వందల మంది పోలీసులు కన్పిస్తరు. మంత్రి వస్తున్నాడంటే, ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఎన్ని కిలోమీటర్లు అయినా దారి పొడుగునా పోలీసులే. వాహనాలు, హారన్‌లు, పెద్ద హల్‌చల్ చేస్తారు. ఏ మంత్రి అయినా, వీఐపీ అయినా రావచ్చు. పోవచ్చు. ఇది వరకు ఉన్నట్టు తీవ్రవాద సమస్యలు కూడా లేవు. అయినా మొత్తం పోలీసు ప్రదర్శనతో నిండి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఎందుకింత మంది పోలీసులు

దారులన్నీ బంద్ చేసి వీఐపీ వాహనాలను పంపడం, ట్రాఫిక్ జాం చేయడం ఇబ్బంది. అంతిమంగా ఇట్ల ఎందుకు చేస్తున్నారంటే ఏం అర్థం కాదు. అట్లాగే ప్రతిపక్ష నాయకులను ఇండ్లల్ల నిర్బంధించడం బయటకు రాకుండా చేయడం నిరసన కూడా తెలపకుండా చేయడం కూడా చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రజలు ఏం అనుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎట్లా తెలుస్తుంది. నిరసన రూపంలోనే కదా మన తెలంగాణ వచ్చింది. అంతటా ప్రజలు రహదారుల మీదకి వచ్చి ఎన్ని నిరసనలు ర్యాలీలు చేయలేదు. అదొక ప్రజాస్వామిక డిమాండ్. ఇప్పుడు మరో దానికి తావు లేకుండా నడుస్తుంది. ఈ కాలం పోలీసులకు పౌరులతో సంబంధాలు ఇది వరకు కన్నా స్నేహపూర్వకంగానే ఉన్నాయి. కానీ, సేవలన్నీ బందోబస్తు ప్రదర్శనకే సరిపోతున్నాయి.

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

ఎర్ర శిఖరం!
బుల్డోజరు