అంతరంగం: సెల్‌తో జర పదిలం మరి!!
కాలగమనంలో కొన్ని అవసరాలు తప్పనిసరి అయితాయి. చెలామణిలో ఉన్న ప్రపంచంతో పాటు మనమూ నడవాలంటే కొన్నింటిని ఉపయోగిస్తుండాలి
ఉద్యోగ పనులు చేసుకుంటూ కూడా నడుమ నడుమ వాట్సాప్ ఓపెన్ చేసుడే. అపుడు స్టేటస్ పెట్టుడు. యూట్యూబ్‌లో నోటిఫికేషన్ ఓపెన్ చేసుడు. ఓపెన్ చేయబుద్ధి అయ్యేలా యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ పెడతరు. ఒత్తి చూస్తే పావుగంట పాయె! అట్లనే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్. సాలె గూడుల ఇరుక్కున్నట్టే. సెల్ విపరీతంగా చూస్తున్నవాళ్లకు తలనొప్పి కూడా వస్తున్నదట. ఇన్ని నష్టాలున్న సెల్‌ను విడిచి ఒక్కరోజు కూడా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడది ఒక బ్యాంక్, ఒక పోస్టాఫీస్, ఒక క్యాలికులేటర్, ఒక కెమెరా, సకల అంశాల సమాహారం. దానికి తోడుగా చిటికెలో సమాచారం అందించే గూగులమ్మ.
కాలగమనంలో కొన్ని అవసరాలు తప్పనిసరి అయితాయి. చెలామణిలో ఉన్న ప్రపంచంతో పాటు మనమూ నడవాలంటే కొన్నింటిని ఉపయోగిస్తుండాలి. ఏదైనా అతిగా వాడితే అంతే సంగతులు. ఈ మధ్య ఆర్థోపెడిక్ డాక్లర్లకు ఎక్కువ గిరాకీ అవుతుందట. చాలా మందికి మెడ నొప్పులు, కుడి చెయ్యి లాగుడు, పంటి నొప్పి, కొందరికి చూపుడు వేలు నొప్పి తీవ్రతరం అవుతుందట. నిరంతరం సెల్‌ఫోన్‌లో గడపడం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు బొక్కల డాక్టర్లు. ఒక మిత్రుడు ఇటీవల కుడి చూపుడు వేలు గుంజుతోందని దవాఖానాకు పోయిండు. 'ఏం చేస్తారు మీరు?' అని డాక్టర్ అడిగితే 'ఏం లేదు ఇంట్లనే ఉంటాను' అన్నాడు. 'ఇంట్ల ఉండి ఏం చేస్తారు?' అంటే సెల్‌ఫోన్‌లో యూట్యూబ్, వాట్సాప్ ,ఫేస్‌బుక్ చూస్తానని సమాధానం.
'ఎన్ని గంటలు చూస్తున్నారు?' అంటే కనీసం 6,7 గంటలైనా అర చేతిలో సెల్‌ను చూపుడు వేలుతోనే కిందికి మీదకి ఆడిస్తుంటాడని తేలింది. ఇగ నొయ్యదా? అట్లానే ఇంకోగాయన ఇలానే మెడ నరాలు గుంజుతున్నాయని డాక్టర్ దగ్గరికి వచ్చాడు. చేతిలో సెల్‌ఫోన్ ఎత్తి పట్టుకుని మెడను వంచి గంటలకు గంటలు చిద్విలాసంగా యూట్యూబ్ చూస్తే నొప్పి రాదా? అక్కడి సున్నితపు ఎముకలు అరిగిపోయి, తలకాయ మీద మెడకాయ నిలవని స్థితి వచ్చింది. చెయ్యి, మెడనే కాదు నడుముకు కూడా నొప్పి వస్తుంది. సోఫాలోనో ఏదో కుర్చీలోనో అదే పనిగా పద్దతిగా కూర్చోకుంటే, సెల్‌లో మునిగిపోతే నడుము నొప్పులు షురూ అయితయని ఆర్థోపెడిక్ వైద్యులు చెబుతున్నరు.
వీరికి కూడా గిరాకీ
నేత్ర వైద్యులకు కూడా మస్తు గిరాకీ వస్తుందట. అదే పనిగా సెల్ చూస్తుంటే కంటి రెటీనా పాడై పోతోందట. సెల్ నుంచి వచ్చే కాంతి కిరణాలు కండ్ల మీద తదేకంగా పడితే నష్టం కలుగుతుంది. సెల్ లేనిది ఎల్లదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ వాళ్ల వాళ్ల ఆఫీసులోని వాట్సాప్‌లకు కనెక్ట్ అవ్వాలి. అధికారులకు సమాచారం పంపాలి. ప్రధానోధ్యాయులు, మండల, జిల్లాస్థాయిల అధికారులు కలెక్టర్లు లేదా తమ ఉన్నతాధికారులతో కనెక్ట్ అవ్వాల్సిందే. 'వాట్సాప్ కూడా చూస్తలేవా?' అనే విసుర్లు ఉంటాయి.
ఉద్యోగ పనులు చేసుకుంటూ కూడా నడుమ నడుమ వాట్సాప్ ఓపెన్ చేసుడే. అపుడు స్టేటస్ పెట్టుడు. యూట్యూబ్‌లో నోటిఫికేషన్ ఓపెన్ చేసుడు. ఓపెన్ చేయబుద్ధి అయ్యేలా యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ పెడతరు. ఒత్తి చూస్తే పావుగంట పాయె! అట్లనే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్. సాలె గూడుల ఇరుక్కున్నట్టే. సెల్ విపరీతంగా చూస్తున్నవాళ్లకు తలనొప్పి కూడా వస్తున్నదట. ఇన్ని నష్టాలున్న సెల్‌ను విడిచి ఒక్కరోజు కూడా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడది ఒక బ్యాంక్, ఒక పోస్టాఫీస్, ఒక క్యాలికులేటర్, ఒక కెమెరా, సకల అంశాల సమాహారం. దానికి తోడుగా చిటికెలో సమాచారం అందించే గూగులమ్మ.
అప్‌డేట్‌లతోనే సరి
అయితే, అదే పనిగా చూస్తే, వ్యసనంగా మారిపోతే అనారోగ్యంతో పాటు రేడియేషన్ ప్రభావం కూడా పడుతుంది. రిటైరైనవాళ్లు. ఏ పని పాట లేని విశ్రాంత జీవితం గడిపేవాళ్లు సెల్‌లో తమ చిన్ననాటి స్నేహితులు, బడి సోపతులు, ఉద్యోగ సహచరుల గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. పొద్దున లేస్తే వాటిని అప్‌డేట్ చెయ్యడం, చూడటంతోనే సరిపోతుంది.
ఇటీవల టెక్నాలజీని చాలా మంది గ్రామాలు, పట్టణవాసులు అందరూ అంది పుచ్చుకుంటున్నారు. యూట్యూబ్ చానళ్లు ఓపెన్ చేస్తే కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నారు. అన్ని రంగాలలో ముందుకుపోయి ఆధునికంగా ఉండవలసిందే. సెల్‌కు సెలవు ఇయ్యకపోతే రోగాలతో మంచాన పడటం ఖాయం. సెల్ చూడటానికి ఉదయం అర్థగంట సాయంత్రం ఓ గంట లేదా అర్ధగంట కేటాయించుకుంటే మంచిది.
అన్నవరం దేవేందర్
94407 63479