కాకికి, మనిషి చావుకు ఎలాంటి సంబంధం ఉంది.. పండితులు ఏం చెబుతున్నారో తెలుసా

కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది, కాకి తల పై తంతే అశుభమా, కాకి అరిస్తే నిజంగా చుట్టాలు వస్తారా.

Update: 2024-10-08 06:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది, కాకి తల పై తంతే అశుభమా, కాకి అరిస్తే నిజంగా చుట్టాలు వస్తారా. కాకికి ఎలాంటి ఆహారం పెడితే మంచి జరుగుతుంది. కాకి గురించి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో వస్తూనే ఉంటాయి. పిత్రుదేవతల స్వరూపంగా చెప్పే కాకిని లేవగానే చూడడం కొంత మందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లు కాకిని చెడు శకునంగా భావిస్తారు. అంతే కాదు మరికొంతమంది కాకి అరిచినా అశుభంగా భావిస్తారు. ఇదిలా ఉంటే మన గ్రాంథాలు, పురుణాలు ఆ కాకిని యమదూతగా భావిస్తారు. అందులో నిజమెంత ఉంది.. మనిషి చావునకు కాకి కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది.. అనే విషయాలు అనేకం దాగి ఉన్నాయి. మరి ఈ విషయాలన్నింటి గురించి పురాణాలు, గ్రంథాలు ఎలాంటి సమాధానం చెబుతున్నారో ఇప్పడు తెలుసుకుందాం.

1. కాకి సామర్థ్యం..

ఎప్పుడూ ఆకాశంలో తిరిగే కాకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఏం విషయాలు అయినా ముందుగానే కనిపెట్టేస్తుందంట. సుమారుగా మూడు నెలలు ముందే ప్రకృతిలో ఎలాంటి మార్పలు సంభవించనున్నాయి కాకికి తెలిసిపోతుందట. అందుకే పూర్వకాలంలో పెద్దవారు కాకుల ద్వారానే ఎదురు కాబోయే సంఘటనల గురించి వివరించేవారట.

2.కాకులు గొడవకు అర్థం ఏంటి : మీ ఇంటి ప్రాంగణంలో కాకుల గుంపులు కూర్చుని అరుచుకుంటే అవి గొడవ పడినట్టు అర్థం. అలా ఇంటి ముందు గొడవ పడినట్లుగా అరుచుకుంటే ఇంటి యజమానికి ఇబ్బందులు కలుగుతాయని అర్థం చేసుకోవాలి.

కాకి అరుపు ఎప్పుడు వింటే అదృష్టం : కాకులు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు ఉత్తరం వైపున లేదా తూర్పు వైపున చెట్టు పై కూర్చుని అరిచినప్పుడు వింటే శుభప్రదంగా ఉంటుంది.

అలాగే ఇంటి పైకప్పు మీద దక్షిణం దిశగా కూర్చుని అరిస్తే మంచి సంకేతం కాదంటున్నారు పండితులు. అలా అరిస్తే ఇంట్లోని వారు ఎవరైనా మృత్యు గండం ఉందనే సంకేతం అని తెలుసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కాకి నీళ్లు తాగడం చూస్తే సంపాదన వస్తుందని సంకేతం. అలాగే ఏదైనా పని కోసం ఎక్కడికైనా వెళితే ఆ పనిలో విజయం సాధిస్తారని సంకేతం అంటున్నారు పండితులు.

నోటిలో రొట్టె ముక్క : కాకి తన నోట్లో మాంసం, రొట్టె ముక్క, ఇతర ఏదైనా ఆహారాన్ని తీసుకుని ఎగురుతూ కనిపిస్తే కోరిన కోరికలు త్వరలో నెరవేరతాయని సంకేతం.

కాకి స్పర్శ : కాకి వచ్చి తలపై తన్నినా, వ్యక్తిని వ్యక్తిని తాకిన అది అశుభానికి సంకేతం అంటున్నారు పండితులు. అలాగే కాకి వ్యక్తి తల పై కూర్చుంటే వారికి చెడు జరుగుతుందని సంకేతం. అలాగే ఆ వ్యక్తికి మృత్యుగండం ఉందని సంకేతం. ఎక్కడికైనా వెళుతున్న సమయంలో కాకి మీ పాదాలకు తాకితే అది శుభ శకునంగా భావిస్తారు. ఇలా జరిగితే జీవితంలో పురోగతి వస్తుందని నమ్మకం. కాకి ఎర్రటి వస్తువుని మనిషికి కనిపించేలా పెడితే వారు త్వరలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని నమ్మకం.

గమనిక : * గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. జ్యోతిష్యం, జ్యోతిష్యపండితుల నుంచి సలహా తీసుకోవాలి.


Similar News