ప్ర‌యోగం స‌క్సెస్‌.. కారు డ్రైవ్ చేస్తున్న ఎలుక‌లు! (వీడియో)

త‌దుప‌రి అభివృద్ధి కోసం అధ్య‌య‌నం కొన‌సాగిస్తున్నారు. trains rats to drive small cars, exploring the potential benefits.

Update: 2022-08-22 10:02 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః యానిమ‌ల్ యానిమేష‌న్ సినిమాల్లో ఇది సాధ్య‌మే రియ‌ల్ లైఫ్‌లో జంతువులు వాహ‌నాలు న‌డ‌ప‌డం న‌మ్మ‌లేము. అందులోనూ, ఎలుక‌లు కారు న‌డ‌ప‌డం అసాధ్య‌మ‌ని అనుకోవచ్చు. కానీ, USలోని రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో ఇది సాధ్య‌మ‌య్యింది. ఇక్క‌డ అధ్యయనంలో భాగంగా చేసిన ప్ర‌యోగాల్లో ఎలుకలు ప్ర‌త్యేకంగా త‌యారుచేసిన కార్లలాంటి వాహ‌నాన్ని నడ‌ప‌డం విశేషం. నిజమైన కార్లు కాక‌పోవ‌చ్చు కానీ, ఖాళీ ప్లాస్టిక్ బాక్సులతో తయారు చేసిన ఈ వాహ‌నం ఎలుక‌లకు 'కారు' అనే లాంటిదే! అయితే, ఎలుకలు చిన్నగా ఉన్న ఈ వాహనాన్ని నడపగల నైపుణ్యాన్ని స్వ‌యంగా సంపాదించుకోవడం అనేదే ఇక్క‌డ పెద్ద‌ విజయం అని చెప్పాలి.

రిచ్‌మండ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెల్లీ లాంబెర్ట్ ఈ చిన్న కార్లను తయారు చేశారు. ఈ కారులో ఎలుకలు తాకేలా లోపల మూడు రాగి కడ్డీలు ఉన్నాయి. ఎలుక ఒక బార్‌ను తాకినప్పుడల్లా, అది సర్క్యూట్‌ను పూర్తి చేసి, కారు కదులుతుంది. ఎడమవైపు ఉన్న బార్ ఎడమవైపుకు కదిలిస్తే, కుడి వైపు బార్ కారును కుడి వైపుకు కదిలిస్తుంది. ప‌రిశోధ‌కురాలు లాంబెర్ట్, ఆమె సహచరులు క‌లిసి ఆరు ఆడ, నాలుగు మగ ఎలుకలను ఎంపిక చేసి, ఈ కార్లను నడపడానికి వాటికి శిక్షణ ఇచ్చారు. కార్లు న‌డిపినందుకు బహుమతిగా వాటికి ఆహారాన్ని కూడా అందించడంతో అవి వాటి తెలివిని ఉప‌యోగించి, ఆహారం ఎక్క‌డ పెట్టార్లో అటువైపుకు కారును న‌డ‌ప‌డం ఇక్క‌డ విశేషం. ఇక‌, త‌దుప‌రి అభివృద్ధి కోసం అధ్య‌య‌నం కొన‌సాగిస్తున్నారు.

మితిమీరిన సరదా.. నాగుపామును ఆడిస్తూ వీడియో  


Similar News