మందుబాబులకు తెలివి ఎక్కువే.. అందుకే తాగుతారంట...

2018 అధ్యయనం ప్రకారం అధిక IQ ఉన్న వ్యక్తులు ఎక్కువ మద్యం సేవిస్తారని తేలింది. అయితే అదే పనిగా తాగరు కానీ తాగినప్పుడు మాత్రం తూగే వరకు ఆగరని చెప్తుంది. అంతేకాదు డ్రగ్స్ కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉందట. ఇంటెలిజెంట్ పర్సన్స్ఈజీగా బోర్ ఫీల్ అవడం వల్ల

Update: 2024-08-31 15:40 GMT

దిశ, ఫీచర్స్ : 2018 అధ్యయనం ప్రకారం అధిక IQ ఉన్న వ్యక్తులు ఎక్కువ మద్యం సేవిస్తారని తేలింది. అయితే అదే పనిగా తాగరు కానీ తాగినప్పుడు మాత్రం తూగే వరకు ఆగరని చెప్తుంది. అంతేకాదు డ్రగ్స్ కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉందట. ఇంటెలిజెంట్ పర్సన్స్ఈజీగా బోర్ ఫీల్ అవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్న అధ్యయనం .. అధిక IQ సాధారణంగా ఆరోగ్యకరమైన అలవాట్లతో కూడా ముడిపడి ఉంటుందని తెలిపింది. ఎక్కువ వ్యాయామం, జిమ్ లో వర్క్ ఔట్ చేయడం వలన ఫిట్‌గా ఉంటారని.. మెరుగైన నోటి పరిశుభ్రత, తక్కువ చక్కెర పానీయాలు తీసుకోవడం, ఫడ్ లేబుల్‌లపై పోషకాహార సమాచారాన్ని చదవడం వంటి వాటితో కూడా అధిక తెలివి ముడిపడి ఉందని తెలిపింది.

ఈ అధ్యయనంలో 5,347 మంది అమెరికన్ పురుషులు, మహిళలు పాల్గొనగా.. ముందుగా 20 ఏళ్ళ వయసులో సర్వే చేయబడ్డారు. తర్వాత మిడిల్ ఏజ్ లోనూ అభిప్రాయాలు సేకరించారు. ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన అలవాట్లు మేధస్సుతో ఎలా ముడిపడి ఉన్నాయో ఆసక్తికరమైన ఫలితాలను అందించారు. మేధావులు మధ్యమధ్యలో భోజనం, స్నాక్స్‌ను తీసుకోకుండా అవాయిడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది.

Tags:    

Similar News