ఏడాదిలోపు పిల్లలకు ఈ ఐదు రకాల ఫుడ్స్ అస్సలు తినిపించకూడదు.. ఎందుకంటే..?
చిన్నపిల్లలకు ఫుడ్ పెట్టే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు.

దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలకు ఫుడ్ పెట్టే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ ఫుడ్ పెట్టాలి? వద్దు అని పేరెంట్స్ వైద్యుల్ని ముందే అడుగుతారు. మానసిక, శారీరక అభివృద్ధికి హెల్తీ ఫుడ్ ఎంతో అవసరం. మరీ సంవత్సరం లోపు పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు? ఎందుకు? ఇలాంటి విషయాల్ని తాజాగా నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
కొంతమంది పేరెంట్స్ పిల్లలకు దంతాలు వచ్చే స్టార్టింగ్‌లో పలు రకాల ఫుడ్స్ ఇవ్వడం ప్రారంభిస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఏడాది లోపు పిల్లలకు తేనె అస్సలు తినిపించకూడదు. తేనెలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కాగా జీర్ణ వ్యవస్థలో పలు ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాల మీదకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పండ్లను రసాలుగా మార్చి తాగిపించొద్దు. ఫ్రూట్స్ జ్యూస్‌లో షుగర్ అధికంగా ఉంటుంది. కాగా పిల్లల దంతాలకు హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అతిగా ఉండటం కారణంగా పొట్ట సమస్యు కూడా తలెత్తుతాయి. అలాగే షుగర్ అండ్ సాల్ట్ కూడా పెట్టొద్దు.
మూత్రపిండాలు, గుండెపై చెడు ప్రభావం చూపిస్తుందట. అప్పుడప్పుడే ఎదుగుతోన్న రుచి గ్రంథులు దెబ్బతింటాయి. అలాగే పచ్చి ఆహారాలు పెట్టకూడదు. తద్వారా రోగనిరోధక శక్తి వీక్ అయిపోతుంది. కొన్ని సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే చాన్స్ ఉంటుంది. క్యారెట్, ఆపిల్ వంటివి మెత్తగా ఉడికించి ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.