Viral video: చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారా? మర్డర్ కేసులో బుక్ అవుతారు జాగ్రత్త!

సాధారణంగా కొంతమంది చెత్తను చెత్తకుండీలో కాకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై పడేస్తుంటారు.

Update: 2025-03-15 08:46 GMT

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కొంతమంది చెత్తను చెత్తకుండీలో (Dustbin) కాకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై పడేస్తుంటారు. ప్రభ్వుతాలు స్వచ్ఛతపై ఎంత అవగాహన కల్పించినా, బహిరంగ ప్రదేశాల్లో ఇలా చెత్త వేయడం తప్పని తెలిసినా.. తమ తీరుని మార్చుకోరు. తిన్న తర్వాత ప్లాస్టిక్ బాక్సులు, వాటర్ బాటిల్ అయినా, స్నాక్స్ ప్యాకెట్లైనా.. ఇలా ఎలాంటి చెత్తనైనా నిర్లక్ష్యంగా రోడ్డుపైనే పడేసి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా నెట్టింట ఓ వీడియో వైరల్‌ (Viral video) అవుతోంది.

ఓ వ్యక్తి హైవే పై ఓపెన్ రూఫ్ కారులో కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. ఇంతలో అతడి కూల్ డ్రింక్ అయిపోతుంది. రోడ్డు పక్కనే డస్ట్‌ బిన్ కనపడుతుంది. దీంతో కారులో వెళ్తునే దాన్ని అందులోకి విసిరేస్తాడు. అయితే, అది కాస్తా అందులో పడకుండా వెళ్లి ఎక్కడో పడుతుంది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అది పడిన ప్రదేశంలోనే పోలీసులు మర్డర్ కేసుకు సంబంధించిన క్లూస్ వెతుకుతుంటారు. ఈ క్రమంలో వారికి ఆ కూల్ డ్రింక్ టిన్ కనబడటంతో దాన్ని క్లూగా తీసుకుని వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు 'మోడ్రన్ స్వచ్ఛ భారత్ యాడ్', స్మైలీ ఎమోజీస్, ఇక వీడి పని అస్సామే అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.


Click here for video

Tags:    

Similar News