టికెట్స్ తీసుకోమని అడిగితే ఆ వీడియోలు చూపిస్తున్న మహిళలు.. షాక్‌లో బస్ కండక్టర్స్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఆర్టీసీ(RTC)ల్లో ఉచిత ప్రయాణం(Fress Bus Scheme) ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఆర్టీసీ(RTC)ల్లో ఉచిత ప్రయాణం(Fress Bus Scheme) ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బస్ ఎక్కి ఎక్కడికైనా వెళ్లొచ్చు. మహిళలు ఎవరూ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పుట్టింటికి వెళ్లాలన్నా, ఏదైనా ఆలయానికి వెళ్లాలన్నా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని చంద్రబాబు హామీ ఇచ్చారు. బస్సుల్లో కండక్టర్లు టికెట్ అడిగితే.. తాను చేసిన హామీ వీడియోను చూపించండి అని అన్నారు.
అయితే.. చంద్రబాబు(Chandrababu) ఇచ్చిన హామీని ఏపీ మహిళలు(AP Womens) సుబ్బరంగా వినియోగించుకుంటున్నారు. ఎంతలా అంటే.. ఇంకా రాష్ట్రంలో స్కీమ్ స్టార్ట్ కాకముందే.. కండక్టర్లకు షాకిస్తున్నారు. ఇటీవల ఓ బస్సులో మహిళలను టికెట్ తీసుకోవాలని కండక్టర్ అడిగారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో మహిళలు టికెట్ తీసుకోకుండా.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటల విడియోను చూపిస్తున్నారు. ఇది చూసిన కండక్టర్లు షాక్‌కు గురవుతున్నారు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి కొందరు నెటిజన్లు ఫన్నీగా, మరికొందరు సీరియస్‌గా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో తక్షణమే ఫ్రీబస్ స్కీమ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం ఫ్రీ బస్ స్కీమ్(Fress Bus Scheme)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) కసరత్తు ప్రారంభించింది. 2025-26 వార్షిక బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. తాజాగా మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం.. తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది.