IRCTC Tour Packages: వేసవి సెలవుల్లో ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అదిరిపోయే ప్యాకేజీ ఇదే!
చాలా మంది సమ్మర్ వచ్చిందంటే టూర్లకు ప్లాన్ చేస్తుంటారు.
దిశ, వెబ్ డెస్క్: చాలా మంది సమ్మర్ వచ్చిందంటే టూర్లకు ప్లాన్ చేస్తుంటారు. సరదాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అదిరిపోయే ప్యాకేజీని అందిస్తోంది. 'హెరిటేజ్ ట్రయాంగిల్ (Heritage Triangle)' పేరుతో దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చుట్టి చూపించనుంది. మరీ ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీసీ 'హెరిటేజ్ ట్రయాంగిల్' పేరుతో అందించే ఈ ప్యాకేజీలో పర్యాటన మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ మార్చి 24వ తేదిన అందుబాటులో ఉండనుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా ఢిల్లీ చేరుకోవాలి. ఇక ఈ టూర్‌లో ఢిల్లీలోని చారిత్రక, అందమైన ప్రదేశాలను చూడవచ్చు.
ప్యాకేజీ ధర వివరాలు
* సింగిల్ షేరింగ్ స్లీపర్ క్లాస్‌కు ధర రూ.39,270 ఉండగా, థర్డ్ ఏసీ అయితే, రూ.42,350
* డబుల్ షేరింగ్ స్లీపర్ క్లాస్ రూ.21,340, థర్డ్ ఏసీ రూ.24,420
* ట్రిపుల్ షేరింగ్ స్లీపర్ క్లాస్ రూ.16,340, థర్డ్ ఏసీ రూ.19,430
* 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ స్లీపర్ క్లాస్ రూ.11,850, థర్డ్ ఏసీ రూ.14,940
* 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ అవుట్ బెడ్ స్లీపర్ క్లాస్ రూ.10,540, థర్డ్ ఏసీ రూ.13,630
ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు
* ప్రయాణ ఛార్జీలు (హైదరాబాద్ నుంచి ఢిల్లీ తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్)
* హోటల్లో వసతి సదుపాయం
* ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లు
* లోకల్ ప్లేస్‌లు చూసేందుకు వెహికల్
* జీవిత భీమా సౌకర్యం
టూర్ ప్లాన్
* మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. ఆ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
* 2వ రోజు ఉదయం 8 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రైల్వేస్టేషన్ నుంచి హోటల్‌కు చేరుకుని చెకిన్ అవుతారు. ఫ్రెష్ అయ్యాక ఢిల్లీలోని చారిత్రక కట్టడం కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, అక్షరధామ్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రికి ఢిల్లీలోనే బస ఉంటుంది.
* 3వ రోజు ఉదయం హోటల్ చెక్ అవుట్ అయి.. ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత ఆగ్రాకు బయలుదేరుతారు. సాయంత్రానికి ఆగ్రా చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి, ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
* 4వ రోజు తాజ్ మహల్ సందర్శిస్తారు. అనంతరం చెక్ అవుట్ చేసి ఆగ్రా ఫోర్ట్ విజిట్ చేస్తారు. అక్కడ నుంచి మథుర బయలుదేరుతారు. మథురలోని కృష్ణ జన్మభూమిని దర్శించుకున్న తర్వాత నైట్ మథురలో బస చేస్తారు.
* 5వ రోజు హోటల్లో చెక్ అవుట్ తర్వాత బృందావనం విజిట్ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత మథుర జంక్షన్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
* ఆరో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com విజిట్ చేసి ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
Read Also..