Skin: మీ చర్మం మెరిసిపోవాలంటే.. వీటిని పాటించండి..!
మనలో అమ్మాయిలు, అబ్బాయిలు చర్మం సంరక్షణ కోసం ఎంతో డబ్బును ఖర్చు పెడతారు
దిశ, వెబ్ డెస్క్ : మనలో అమ్మాయిలు, అబ్బాయిలు చర్మం సంరక్షణ కోసం ఎంతో డబ్బును ఖర్చు పెడతారు. అయితే, వీటిని ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని మన శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. వీటికి కావాల్సినంత నిద్ర, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి తినకపోవడం, అలాగే కావాల్సినన్ని నీళ్ళు తాగడం కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
అయితే, చర్మాన్ని అందంగా తయారు చేసుకోవాలంటే కొన్ని రకాల జ్యూస్ లు చాలా ఉపయోగపడతాయి. శరీరంలోని మలినాల్ని తొలగించి, మృదువుగా చేయడంతో పాటు మెరిసేలా చేస్తాయి. ఆ జ్యూసులని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుని, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
యాపిల్, క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి. వీటన్నింటినీ ఒకే దగ్గర మిక్స్ చేసి, పానీయంలా తయారు చేయాలి. వాటితో పాటు కొత్తిమీర, పూదీన, నిమ్మరసం తీసుకుంటూ ఉండాలి. ఈ మూడింటినీ మిక్స్ చేసి జ్యూస్ లాగా తయారు చేయాలి. ఈ జ్యూస్ లను రోజుకొకసారి తాగాలి. ఒకే సారి రెండు కలిపి తాగడం కంటే ఒకటి పొద్దున్న తాగి , ఇంకోటి సాయంత్రం తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు తాగితే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.