పడుకునే ముందు వాము నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు..?

వాము (Ajwain/Carom seeds) ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.

Update: 2025-03-15 16:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాము (Ajwain/Carom seeds) ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వాము కీళ్ల నొప్పులను తగ్గించడంలో మేలు చేస్తుంది. వాములో రిచ్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. థయామిన్, నియాసిన్, సోడియం, పొటాషియం, పాస్ఫరస్, కాల్షియంలు కూడా దట్టంగా ఉంటాయి. వీటితో పాటు ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ వంటి వాటి వల్ల హెల్త్‌కు అనేక ప్రయోజనాలున్నాయి.

వాము వాటర్ తాగితే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి నుంచి ఉపశమనం తగ్గిస్తుంది. అంతేకాకుండా.. ఇది అర్థరైటిస్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఎరుపుదనం, వాపు, కీళ్లలో నొప్పులు తగ్గుతాయి. వామును పేస్టులా చేసి సమస్యున్న ఉన్న చోట రాస్తే.. శరీరంలోని వేడి తగ్గుతుంది. వాము గింజల్ని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె కణాల్ని హెల్త్‌గా ఉంచుతుంది. హెల్తీ కొలెస్ట్రాల్ పెరగడం, కడుపు సంబంధిత సమస్యలు వంటి లాభాలు చేకూర్చుతుంది.

రక్తపోషకాలను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, వాము జీవక్రియను పెంచి, కొవ్వు కరిగి బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. చాలా మంది వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కూడా. వామును టూత్‌పేస్ట్‌లు, మౌత్ వాష్‌లలో కూడా వాడుతారు.

అయితే పడుకునే ముందు వాము వాటర్ తాగితే పంటి నొప్పి వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాము పొడిని, ఆలివ్ నూనె ను కాస్త గోరు వెచ్చని వాటర్‌లో కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. తద్వారా నోటి దుర్వాస, త్రేన్పులు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వెయిట్ ఈజీగా తగ్గుతారు. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News