Shalini Saraswathi : ఆమె సంకల్పం ముందు వైకల్యమే తలవంచింది..! బ్లేడ్ రన్నర్ షాలినీ సర్వస్వతి సక్సెస్ జర్నీ..
Shalini Saraswathi : ఆమె సంకల్పం ముందు వైకల్యమే తలవంచింది..! బ్లేడ్ రన్నర్ షాలినీ సర్వస్వతి సక్సెస్ జర్నీ..

దిశ, ఫీచర్స్
ఉలికి భయపడితే శిల శిల్పమౌతుందా?
ఓటమికి భయపడితే విజయం దరిచేరుతుందా?
మనమూ అంతే బాస్..
భయపడితే ఓడిపోతాం..
ధైర్యం చేస్తే అనుకున్నది సాధిస్తాం..
అదే చేసి చూపింది షాలినీ సరస్వతి
షాలినీ సరస్వతి.. క్రీడా ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరిది. మన దేశంలోనే మొదటి ఉమన్ బ్లేడ్ రన్నర్, మారథానర్, పబ్లిక్ స్పీకర్, మోటివేటర్. అంతేకాదు తను ఓ గొప్ప బ్లాగర్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్‌లో డైరెక్టర్ కూడాను. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. అన్ని అవయవాలు, వనరులు, పరిస్థితులు సక్రమంగా ఉన్నా ఏమీ సాధించలేం అనుకుంటూ ఉంటాం మనం. కానీ అంగవైకల్యం ఉండి కూడా అవరోధాలను అధిగమించిన ధీశాలి షాలిని సరస్వతి. 2023లో చైనాలో జరిగిన ఆసియా పారా (At the Asian Para Games-2023 in China) గేమ్స్ టీ62 విభాగంలో విజయం సాధించి ఆసియా ఖండంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఉమన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఒక వికలాంగురాలైన మహిళకు ఇదంతా ఎలా సాధ్యమైందనే సందేహాలు కలగడం సహజమే.. కానీ సంకల్పం బలంగా ఉంటే పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని, వైకల్యం తలవంచి, విజయం ముంగిట్లో వాలుతుందని నిరూపించింది షాలిని.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
షాలిని బెంగుళూరు చెందిన ఓ సాధారణ క్రీడాకారిణి. (2019 నాటికి ఆమె వయసు 39 సంవత్సరాలు) కాగా ఆమె 2013లో తన భర్తతో కలిసి కంబోడియాలో ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ(Celebrating the fourth wedding anniversary)ని సెలబ్రేట్ చేసుకున్నది. ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా. అయితే ఇక్కడే ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఏదో అనారోగ్యం వేధించసాగింది. డాక్టర్లు మొదట డెంగ్యూ కావచ్చునని అనుమానించారు. కానీ.. తర్వాత ఓ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్(Rickettsia)గా గుర్తించారు. దీనివల్ల ఆమె శరీరంలో గ్యాంగ్రీన్ వ్యాపించి, ఆమె తన రెండు చేతులు, కాళ్లను కోల్పోవడానికి దారితీసింది. దురదృష్టవశాత్తు ఆమె తన గర్భంలోని బిడ్డను కూడా కోల్పోయింది.
అక్కడే ఆగిపోలే..
షాలినికి గ్యాంగ్రీన్ సోకడంతో అది శరీరమంతా వ్యాపించి, ప్రాణాంతకంగా మారకుండా డాక్టర్లు ఆమె కాళ్లు, చేతులను తొలగించాల్సి వచ్చింది. ఊహించడానికే భయకరంగా అనిపిస్తుంది కదూ.. మరి ఆ పరిస్థితిని స్వయానా అనుభవించిన షాలిని ఇంకెంత కృంగి, కృషించి పోవాలి? అదే జరగుతుందేమోనని, షాలిని తమకు దక్కదేమోనని ఆమె భర్త, కుటుంబం చాలా ఆందోళన చెందారు. కానీ షాలిని (Shalini Saraswati) మాత్రం జగమొండి. బాధతో అక్కడే ఆగిపోలేదు. మోడువారిన చెట్లు సైతం చిగురు తొడిగి పైకిలేచినట్టు.. తనకు కాళ్లు, చేతులు లేకపోతేనేం.. ప్రాణంతో ఉన్నానుగా అది చాలు అనుకుంది. తన సంకల్ప బలం ముందు అదెంత అనుకుందో ఏమో కానీ.. మొక్కవోని మనో ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో వైకల్యాన్ని స్వీకరించిన షాలిని.. తనకు ఎదురయ్యే ప్రతీ సమస్యకు సవాల్ విసురుతూ.. అధిగమిస్తూ ముందడుగు వేసింది. తన కోచ్ బి.పి. అయ్యప్పతో కలిసి మారథాన్‌కు సిద్ధమైంది.
బ్లేడ్ రన్నర్‌గా ఎంట్రీ
గ్యాంగ్రీన్ వల్ల కాళ్లు చేతులు కోల్పోయాననే బాధకంటే తను ఏదో సాధించాలన్న పట్టుదలతో ప్రయత్నం మొదలు పెట్టిన షాలిని 2014లో ఆర్టిఫిషియల్ కాళ్లతో (prosthetics)నడవడం ప్రారంభించింది. సమాజం తనను భిన్నంగా చూస్తుందనో, నలుగురు ఏమనుకుంటారనో అస్సలు పట్టించుకోని ఈ యువతి, తనను తాను నిరూపించుకోవాలని గట్టిగా డిసైడ్ అయిపోయిందట. అందుకోసం బెంగుళూరులోని కంటీవర స్టేడియంలో కోబ్ బిపి. అయ్యప ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటూ రోజూ 90 నిమిషాల పాటు నడక, వ్యాయామం కొనసాగించింది. రెండేళ్ల కఠిన శ్రమ తరర్వాత ఆమె హాఫ్ మారథాన్‌లలో పాల్గొనడం మొదలు పెట్టింది. కాగా ఆమె అందుకోసం జర్మన్ కంపెనీ ఒట్టోబాక్ తయారు చేసిన కార్బన్ - ఫైబర్ రన్నింగ్ బ్లేడ్స్‌ను ఉపయోగించింది. ఇవి ఆమె నడకకు, రన్నింగ్‌కు బాగా సహాయపడ్డాయి.
సాధించిన విజయాలు
2016లో షాలిని బెంగుళూరులో జరిగిన టీసీఎస్ (TCS) 10K రన్‌లో పాల్గొని, దాదాపు రెండు గంటలకంటే కొంచెం ఎక్కువ సమయంలో పూర్తి చేసింది. బ్లేడ్ రన్నర్‌గా ఇదే ఆమె తొలి విజయం. ఈ సక్సెస్ ఆమెకు ఎంతో ప్రేరణనిచ్చింది. వరల్డ్‌వైడ్ వికలాంగులకు, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఇతర మారథాన్‌లలో పాల్గొనేందుకు కారణమైంది. ఆ తర్వాత 2019 నాటికి షాలిని 5 హాఫ్ మారథాన్‌లలో పాల్గొనగా, ఇందులో హైదరాబాద్, బెంగుళూరులో జరిగిన మారథాన్ పోటీల్లోనూ పాల్గొన్నది. తన పూర్తి మారథాన్ (42.2. కి.మీ) పూర్తి చేయాలనే లక్ష్యంతో ట్రైనింగ్ తీసుకుంటోంది. 2017లో 10 కిలోమీటర్ల పరుగును 35 నిమిషాల్లోనే పూర్తిచేసింది. ఆ తర్వాత కూడా ఏమాత్రం తగ్గలే.. 2021లో జాతీయ పారా గ్రీడల్లో (the National Para Games) 100 మీటర్ల పరుగులో స్వర్ణం Gold medal ), 2022లో రజతం (silver) సాధించింది. 2023లో హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్(Hangzhou Asian Games)లో భారత్ తరపును ప్రాతినిధ్యం వహించింది. ఫస్టసోర్స్ పొల్యూషన్ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తూ, అడ్వెంజర్ బియాండ్స్ బారియర్స్ ఫౌండేషన్‌తో కలిసి వికలాంగుల ఉన్నతికి కృషి చేసింది. ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతోంది.
READ MORE ...
High BP: హై బీపీకి చెక్ పెట్టే ఈ సీడ్స్ గురించి తెలుసా ..!