గోర్లు పెరగకపోవడం వల్ల తలెత్తే సమస్యలు.. దీనికి చెక్ పెట్టేదెలా?

సాధారణంగా గోర్లు సరిగ్గా పెరగకపోవడం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంటుంది.

Update: 2025-03-15 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా గోర్లు సరిగ్గా పెరగకపోవడం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇలా అవ్వడానికి అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు. కొన్నిసార్లు ఇలా జరగడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైపోతుంది. గోరు దారుణంగా అయ్యే పరిస్థితికి వస్తుంది కూడా. ఇది సర్జరీకి కూడా దారితీయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది ఈ సమస్యను హోం రెమెడీతో పరిష్కాస్తారు. ఈ సమస్యను నిర్లక్ష్యపెడితే వైద్యుడి సహాయం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

గోర్లు సరిగ్గా పెరగకపోవడానికి ఆహార లోపాలు కూడా ఉండొచ్చు. మనం తినే ఫుడ్‌లో కొన్ని పోషకాలు లేకపోతే కనుక గోర్లు వీక్ అయిపోతాయి. ఈ కారణంగా గోర్లు నెమ్మెదిగా పెరుగుతాయి. అలాగే గోర్లు ఆలస్యంగా పెరిగితే.. మొత్తమే పెరగకపోయినా.. అనీమియా, థైరాయిడ్, వంటి ఇతర సమస్యలు గోర్ల పెరుగుదలను ప్రభావితం చేస్తాయి.

ఇప్పటికే గోర్ల ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా గోర్లు సరిగ్గా పెరగకుండా చేయవచ్చు. గోళ్లను తగినంతగా శుభ్రం చేయకపోవడం, లేదా వాటిని గట్టిగా కత్తిరించడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్నిసార్లు గోర్ల పెరుగుదల సమస్యలు జన్యుపరమైనవి కూడా కావచ్చని అంటున్నారు నిపుణులు.

మరీ గోర్లు సరిగ్గా పెరగాలంటే.. బయోటిన్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారంలో మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్లు, ప్రోటీన్, ఖనిజాలు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ గోళ్లను క్లీన్‌గా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయాలి. తగినంత నిద్ర, వ్యాయామం, మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ముఖ్యం.అయినప్పటికీ గోర్లు సరిగ్గా పెరగకపోతే, వైద్యుడిని సంప్రదించి.. సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read Also..

Skin: మీ చ‌ర్మం మెరిసిపోవాలంటే.. వీటిని పాటించండి..!  

Tags:    

Similar News