Viral video: ఆరేళ్ల బుడ్డిది.. హిట్ మ్యాన్ ట్రేడ్ మార్క్ షాట్స్‌తో వావ్ అనిపించిందిగా..!
నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా క్రికెట్ లవర్స్ అయితే ఈ వీడియోను తెగ లైక్ చేసి, షేర్ చేస్తున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ఆరేళ్ల సోనియా ఖాన్ ఇంటి బయట సరదాగా తన తండ్రితో క్రికెట్ ఆడుకుంటుంది. తండ్రి బౌలింగ్ వేస్తుంటే.. ఈ బుడ్డది సూపర్‌గా షాట్స్ ఆడుతుంది. అంతేకాదు, క్రికెట్ ఆడే విధానం బ్యాటింగ్ టెక్నిక్, క్రీజులో ఆత్మవిశ్వాసం, ముఖ్యంగా పుల్ షాట్ ఆడే విధానం భారత కెప్టెన్ రోహిత్ శర్మను తలపిస్తుంది. దీంతో సోనియా ఖాన్ ఆటతీరుకు ఫిదా అవుతున్న నెటిజన్లు ఆమెను హిట్ మ్యాన్‌తో పోలుస్తున్నారు. సోనియా ప్రతిభను చూసి ముచ్చటపడ్డ ఇంగ్లిష్ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆరేళ్ల వయసులోనే పూర్తి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా షాట్‌లు కొట్టడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియో వైరల్ కాగా, పాకిస్థాన్ ఫ్యూచర్ స్టార్ అని, పురుషుల జట్టులో ఆడించాలని కామెంట్లు పలువురు పెడుతున్నారు.
6 yrs old ~ Talented Sonia Khan from Pakistan 🇵🇰 (Plays Pull Shot like Rohit Sharma) 👏🏻 pic.twitter.com/Eu7WSOZh19
— Richard Kettleborough (@RichKettle07) March 19, 2025