Food Items : షాకింగ్ న్యూస్.. రాబోయే రోజుల్లో అంతరించిపోనున్న ఫుడ్ ఐటమ్స్ ఇవే..!
కల్తీ ఫుడ్స్ తింటూ అనారోగ్యానికి గురవుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రకృతి మనకు ఎన్నో సహజసిద్ధమైన ఆహారాలను ప్రసాదించింది.. వాటిని ఉపయోగించుకోకుండా కల్తీ ఫుడ్స్ తింటూ అనారోగ్యానికి గురవుతున్నారు. అటు పర్యావరణానికి ఇటు మనకు మనమే కోరి కొని తిప్పలు తెచ్చుకుంటున్నాము. అయితే, మనం రోజువారి తీసుకునే ఆహారపు అలవాట్లలో కొన్ని రాబోయే రోజుల్లో అంతరించపోతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అరటి పండు ( Banana )
అరటి సాగు ముందు ముందు చాలా తగ్గిపోతుందని అంటున్నారు. మన ఇళ్ళలో శుభకార్యాలు జరిగినప్పుడు కచ్చితంగా వీటిని వాడుతుంటారు. అయితే, కొన్నేళ్ల తర్వాత కొత్త వైరస్ వలన అరటి జాతి మొత్తం అంతరించిపోతుందని నిపుణులు అంటున్నారు.
కాఫీ ( Coffee )
మనలో చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, కాఫీ గింజలు అందించే మొక్కలు కొన్నేళ్ల తర్వాత, పూర్తిగా అంతరించపోతాయని చెబుతున్నారు.
వైన్ ( Wine )
వైన్ అంటే చాలా మందికి ఇష్టం. వీటిని ద్రాక్షపండ్లతో తయారు చేస్తారు. ద్రాక్ష కాయలను చాలా రోజులు పులియబెట్టి తయారు చేస్తారు. అయితే, ముందు ముందు వర్షాలు తగ్గిపోవడం వలన ద్రాక్ష ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోనుంది. అప్పుడు నాణ్యమైన వైన్ కూడా దొరకదు.
ఆరెంజ్ ( orange )
వరల్డ్ వైడ్ గా సిట్రస్ గ్రీన్ డిసీజ్ అనేది ఆరెంజ్ పండ్లకి సోకడం వలన ఇది పూర్తిగా అంతరించిపోతుంది. ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందడంతో ఆరెంజ్ చెట్లుకూడా ఎక్కడ కనిపించవని అంటున్నారు.
అవకాడో
ఈ భూమి మీద పెరిగే కొన్ని రకాల మొక్కలకు నీరు అవసరం ఎక్కువ అవసరం ఉంటుంది. వాటిలో ఇది కూడా ఒకటి. కరువు కారణంగా వర్షాలు లేక నీరు తగ్గిపోతుంది.. అప్పుడు మొక్కలకు అందే నీటిశాతం మొత్తం తగ్గిపోతుంది.. అప్పుడు, అవకాడో కూడా కనిపించకుండా పోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.