Cooling plants : ఏసీ అవసరం లేదు.. ఎండాకాలంలో ఈ మొక్కలు పెంచండి చాలు!
Cooling plants : ఏసీ అవసరం లేదు.. ఎండాకలంలో ఈ మొక్కలు పెంచండి చాలు!

దిశ, ఫీచర్స్ : మార్చిలోనే భానుడి భగ భగలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులతో పలువురు ఇబ్బంది పడుతున్నారు. బయట తిరిగేవారు, ఇంటి పట్టున ఉంటున్నవారు కూడా ఉక్కబోతలతో అవస్థలు పడుతున్నారు. దీంతో చాలామంది ఏసీలు(Air condtionors), కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడేస్తున్నారు. అయితే ఇవి మాత్రమే కాకుండా వేసవి తాపం నుంచి ఉపశమనానికి పలు మొక్కలు కూడా సహాయపడతాయి. వీటిని ఇంటి ఆవరణలో పెంచడం ద్వారా చల్లదనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కూలింగ్ ప్లాంట్స్ ఏవి? ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.
*ఫికస్ ప్లాంట్ : మొక్కలు, చెట్లు సహజంగానే చల్లదనాన్ని ఇస్తాయి. అయితే ఇంటి ఆవరణలో పెంచుకోగలితే ఉక్కబోతల నుంచి మనకు ఉపశమనం కలిగించి చల్లదనాన్ని ఇచ్చే కొన్ని ప్రత్యేక మొక్కలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాతావరణాన్ని చల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో ఫికస్ మొక్కలు (Ficus plant) ఒకటి. వీటిని ఇంటి ఆవరణలో మట్టి కుండీలల్లో పెంచడం ద్వారా వేడి గాలిని శుద్ధిచేసి చల్లదనాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
*బేబీ రబ్బర్ ప్లాంట్స్ : చూడటానికి చిన్నగా ఉండే బేబీ రబ్బర్ ప్లాంట్ (Baby Rubber Plants) ఇంటిలో పెంచుకోవడానికి అనువైనది. పైగా ఈ మొక్కలకు డైలీ నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు. చుట్టు పక్కల వాతావరణాన్ని చల్లబరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇంటి ఆవరణలో పెంచుకోవడం ద్వారా పరిసరాలు, ఇంటి వాతావరణాన్ని మిగతా ప్రదేశాలతో పోల్చితే చల్లగా మారుస్తాయి.
*ఫెర్న్ ప్లాంట్ : ఫెర్న్ మొక్క(Fern plant) చల్లదనాన్ని ఇచ్చేదిగా ప్రసిద్ధి చెందింది. ఇండ్లల్లో పెంచుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్తుంటారు. ఎందుకంటే ఇది గాలిలో తేమను పీల్చి, తనలో స్టోర్ చేసుకునే గుణం కలిగి ఉంటుంది. వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఆ తేమను విడుదల చేస్తుంది. ఎటువంటి పువ్వులు, కాయలు ఉండవు. కేవలం ఆకులతో ఉండే ఈ మొక్క చల్లదనాన్ని ఇవ్వడంలో మాత్రం అద్భుతంగా పని చేస్తుంది. దీంతోపాటు కలబంద మొక్క కూడా చల్లదనాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
Read More..
High BP: హై బీపీకి అదిరే చిట్కా.. మోదీ కూడా ఇదే ఫాలో అవుతారు.. కేవలం రెండు గంటల్లో రక్తపోటు హాం ఫట్!