Urine: రాత్రిపూట మూత్రానికి ఎక్కువగా వెళ్తున్నారా? అయితే ఈ సమస్య చాలా డేంజరా? షుగర్ కు సంకేతామా?
Night Time Urinate Frequently: మనలో చాలా మందికి రాత్రి సమయంలో ఎక్కువగా మూత్రం(Urine) వస్తుంటుంది.
దిశ, వెబ్ డెస్క్: Night Time Urinate Frequently: మనలో చాలా మందికి రాత్రి సమయంలో ఎక్కువగా మూత్రం(Urine) వస్తుంటుంది. అయితే ఒకసారి వస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ తరచుగా ఎక్కువ సార్లు వస్తే మాత్రం ఆందోళన చెందుతుంటారు. ఇంకా షుగర్ లాంటి వ్యాధులు లేకపోయినా రాత్రి పూట ఎక్కువ సార్లు మూత్రం వస్తే టెన్షన్ పడుతుంటారు. ఇలా ఎక్కువసార్లు మూత్రం(Urine) రావడం అనారోగ్యానికి సంకేతామా..ఏదైనా ప్రమాదామా అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు. రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్రం పోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా 50 నుంచి 55ఏళ్లు దాటిన తర్వాత మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి(Prostate gland)లో వాపు రావడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మూత్రం సరిగ్గా బయటకు రాకపోవడం, మిగిలిపోవడం వల్ల శరీరంలో పేరుకుపోయి రాత్రిపూట ఎక్కువగా సార్లు వస్తుంది. సాధారణంగా రాత్రి ఒకసారి మూత్రం(Urine) వస్తే సమస్యకాదు. నిద్రపోయిన తర్వాత అంతకంటే ఎక్కువగా మూత్రం(Urine) కోసం వస్తే సమస్యగా భావించాలి. ముఖ్యంగా మనం ప్లాట్ గా పడుకున్నప్పుడు కాళ్లలో ఉన్న రక్తం మళ్లీ శరీరంలోకి సరఫరా జరిగి అవి కిడ్నీలోకి వెళ్లి మూత్రం(Urine) లా మారుతుంది. ఫలితంగా తరుచుగా మూత్రం వస్తుంది. దీంతో పాటు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కూడా మూత్రం ఎక్కువసార్లు వస్తుంది. బ్లాడర్ మీద ఒత్తిడిని పడినా కూడా ఈ సమస్య వస్తుందని యూరాలజిస్టులు(Urologists) చెబుతున్నారు.
ఇది మాత్రమే కాదు తరచుగా మూత్రం(Urine) రావడం అనేది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువసార్లు మూత్రం(Urine) వెళ్లాల్సి వస్తుందంటున్నారు. ఇందుకు యూరిన్ ఇన్ఫెక్షన్(Urine infection) కారణం అయ్యే ఛాన్స్ ఉంటుందని అందుకోసం యూరిన్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దాహం కాకపోయినా..ఎక్కువగా నీళ్లు తాగకపోయినా తరచుగా మూత్రం (Urine)వస్తే షుగర్ కూడా కారణం కావచ్చని తెలిపారు. కానీ కొందరిలో మాత్రం డయాబెటిస్(Diabetes) వల్ల దాహం ఎక్కువగా వేసి తరుచుగా మూత్రానికి వెళ్తుంటారని తెలిపారు.
ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఆల్ట్రా సౌండ్(Ultra Sound), యూరిన్ టెస్ట్ (Urine test)చేయించకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితాల ఆధారంగా వైద్యుల సూచనతో మందులు వాడాలని చెబుతున్నారు. అయితే కొందరిలో మాత్రం ఈ మందులు ప్రయోజనం చేకూర్చవని చెబుతున్నారు. అలాంటి వారికి ఎండోస్కోపిక్ లేజర్(Endoscopic laser) విధానం ద్వారా చికిత్స అందించవచ్చని సలహా కూడా ఇస్తున్నారు.
Read More..
మీరు తాగే నీటిలో చిటికెడు ఉప్పు జోడించండి.. అనేక లాభాలు మీ సొంతం?