పబ్లిక్‌లో అపరిచితులతో సెక్స్.. ఆ షోలో అంతా ఓపెన్.. (వీడియో)
రణ్‌వీర్ అలహాబాదియా పదేళ్లుగా సంపాదించుకున్న పేరును ఒక్క వల్గర్ జోక్‌తో చేతులారా పాడుచేసుకున్నాడు. పేరెంట్స్ ఇంటిమసీ గురించి మాట్లాడి ప్రస్తుతం విచారణ, రిమాండ్ అంటూ జైలు, కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.

దిశ, ఫీచర్స్ : రణ్‌వీర్ అలహాబాదియా పదేళ్లుగా సంపాదించుకున్న పేరును ఒక్క వల్గర్ జోక్‌తో చేతులారా పాడుచేసుకున్నాడు. పేరెంట్స్ ఇంటిమసీ గురించి మాట్లాడి ప్రస్తుతం విచారణ, రిమాండ్ అంటూ జైలు, కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ‘‘ఇండియన్ గాట్ లేటెంట్’’ షోలో ఈ సంఘటన జరగ్గా.. దీన్ని హోస్ట్ చేస్తున్న సమయ్ రైనా కూడా ఇబ్బందుల పాలవక తప్పలేదు. ఇదిలా ఉంటే.. ‘‘ది ఎస్కేప్ రూమ్’’ అనే మరో షో కూడా ఇలాంటి పనులే చేస్తుంది. అయితే జోక్స్ మాదిరిగా కాకుండా కన్ఫెషన్ రూమ్‌లో తాము చేసిన తప్పులు ఒప్పుకునేలా ప్లాన్ చేశారు. ఇది స్క్రిప్టెడ్ షో మాదిరిగానే ఉన్నా రియల్ పర్సన్స్ వచ్చి తమ కన్ఫెషన్ గురించి చెప్తారని అంటున్నారు నిర్వాహకులు.
కమెడియన్ హర్ష్ గుజ్రల్ కండక్ట్ చేస్తున్న ఈ షోలో చాలా మంది తమ శృంగార కథలు, ఇల్లీగల్ రిలేషన్స్, లేదా తల్లిదండ్రులు రిలేషన్స్ గురించి మాట్లాడుతున్న ఎపిసోడ్స్ బయటకొచ్చాయి. అయితే రణ్‌వీర్ కేసు తర్వాత ఇవన్నీ యూట్యూబ్‌లో గుజ్రల్ డిలీట్ చేసినా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం వైరల్ అవుతున్నాయి. ‘‘భర్త బిజినెస్ లాస్ అయిందని భార్య కామెల్ మోడల్ ట్రై చేయడం’’, ‘‘పబ్లిక్‌లో అన్‌నోన్ పర్సన్‌తో శృంగారంలో పాల్గొనడం’’, ‘‘ తండ్రి ఎఫైర్ గురించి తెలిసిన తల్లి చెప్పుకుంటే ఆ విషయం బయటకు రాకుండా చేసేందుకు తంటాలు పడ్డ కూతురు’’.. ఇలా విషయాలన్నీ కూడా సెక్స్, ఎఫైర్స్ గురించే తిరుగుతుంటాయి. అయితే ఇలాంటి వీడియోలు చూస్తున్న నెటిజన్లు.. సెన్సార్ ఓ మూలన నిల్చొని చూస్తుందా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.