శోభనం రోజు రాత్రే నా భార్య గర్భవతి అయిందా..?
మా పెళ్ళయి 20 వారాలే అవుతోంది. ఇప్పుడు మా ఆవిడకు 5వ నెల.

డాక్టర్ గారూ! నా వయస్సు 26 సంవత్సరాలు.. మా ఆవిడ వయస్సు 18 సంవత్సరాలు. మా పెళ్ళయి 20 వారాలు అవుతోంది. ఇప్పుడు మా ఆవిడకు 5వ నెల. సెప్టెంబర్ 1న తనకి నెలసరి వచ్చింది. సెప్టెంబర్ 9న మా మొదటిరాత్రి నాడు కలిశాం. అయితే స్కానింగ్ (అల్ట్రాసౌండ్ స్కానింగ్) ప్రెగ్నెన్సీ 20 వారాలు అని వుంది. అంటే మొదటిసారి కలిసినప్పుడే గర్భం వచ్చే అవకాశం ఉందా? పెళ్ళయి 20 వారాలే. కానీ రిపోర్టులో 21.2 వారాలుగా ఎందుకు వుంది? 20 వారాలే ఉండాలి కదా? - కె.ఆర్. వరంగల్.
మీ రిపోర్టు ప్రకారం, ఆమె చివరి నెలసరి తేదీకి సరిగ్గానే వుంది. గర్భస్థ కాలాన్ని చివరి నెలసరి తేదీ నుంచి లెక్క గడితే 21 వారాలే వస్తుంది. నీ భార్య గర్భస్థ కాలం సరైనదే. అనవసరంగా భార్యను అనుమానించి జీవితాన్ని నాశనం చేసుకోకు.
- డాక్టర్ భారతి,
సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్ కౌన్సెలింగ్