మానవ శరీరంలో కొత్త అవయవాన్ని గుర్తించిన పరిశోధకులు.. ఏ బాడీ పార్ట్‌లో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
మానవ శరీరంలోని అవయవాల గురించి మనకు పూర్తిగా తెలుసని అనుకున్నాం. కానీ మనకు తెలియని కొత్త అవయవం ఉందని గుర్తించారు పరిశోధకులు. జీర్ణవ్యవస్థలో

దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలోని అవయవాల గురించి మనకు పూర్తిగా తెలుసని అనుకున్నాం. కానీ మనకు తెలియని కొత్త అవయవం ఉందని గుర్తించారు పరిశోధకులు. జీర్ణవ్యవస్థలో ఒక నిర్మాణమైన స్పెషల్ హ్యూమన్ ఆర్గాన్ మెసెంటరీని అధికారికంగా కనుగొన్నారు. ఇంతకు ముందు దీన్ని ఉదర కుహరపు విచ్ఛిన్నమైన, అస్పష్టమైన భాగమని భావించారు. కానీ కొత్త పరిశోధన మెసెంటరీ అనేది ప్రేగులను హోల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్మాణమని తెలిపింది.
ఐర్లాండ్‌లోని యూనివర్శిటీ హాస్పిటల్ లిమెరిక్‌కు చెందిన కాల్విన్ కాఫీ నేతృత్వంలోని ఈ పునఃవర్గీకరణ.. గ్రేస్ అనాటమీ వంటి వైద్య పాఠ్యపుస్తకాలలోనూ చేరింది. ఇప్పుడు వైద్య విద్యార్థులకు బోధించబడుతోంది. దీని ఖచ్చితమైన పనితీరు అస్పష్టంగా ఉన్నప్పటికీ, కొత్తగా గుర్తించబడిన ఈ అవయవాన్ని అధ్యయనం చేయడం వల్ల ఉదర, జీర్ణ సంబంధిత వ్యాధులను అర్థం చేసుకోవడంలో, చికిత్స చేయడంలో పురోగతి ఉండవచ్చని భావిస్తున్నారు సైంటిస్టులు.
మెసెంటరీ ఆవిష్కరణ కొత్త వైద్య రంగానికి నాంది పలికింది. మెసెంటెరిక్ సైన్స్.. మానవ ఆరోగ్యంలో దాని పాత్రను వెలికితీసే లక్ష్యంతో సాగుతుంది. దీని పనితీరుపై లోతైన అవగాహన అసాధారణమైన మెసెంటెరిక్ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న వ్యాధులను గుర్తించడంలో సహాయపడుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు. మన సొంత శరీరాల గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉందని అంటున్నారు. కాగా తదుపరి పరిశోధనతో మెసెంటరీ జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఉదర సంబంధిత రుగ్మతలకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేయడంలో కీలకమైన విషయాలు వెల్లడిస్తామని తెలిపారు సైంటిస్టులు.