Dry fruits: సహజంగా కంటి చూపును మెరుగుపర్చే 6 డ్రై ఫ్రూట్స్..?
జీడిపప్పు, వాల్‌నట్‌లు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, ఖర్జూరం, ఆప్రికాట్లు వంటి గింజలు.. ఎండిన పండ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: జీడిపప్పు, వాల్‌నట్‌లు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, ఖర్జూరం, ఆప్రికాట్లు వంటి గింజలు.. ఎండిన పండ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అవి విటమిన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి వయస్సు సంబంధిత కంటి సమస్యలను కూడా నివారించడంలో మొత్తం దృష్టిని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారంలో వాటిని చేర్చడం వల్ల కంటి పనితీరు మెరుగుపడుతుంది.
గింజలు అలాగే ఎండిన పండ్లలో దట్టమైన పోషకాలు ఉంటాయి. ఈ ఎండిన పండ్లలో విటమిన్లు A, C, E, జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి కీలకమైన పోషకాలను అందిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన దృష్టిని నిర్వహించడానికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటిలో UV కిరణాలు, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కళ్లను రక్షించే లుటీన్ అండ్ జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా దట్టంగా ఉంటాయి. కంటి చూపును పదును పెట్టడానికి నిపుణులు చెప్పిన 7 ఎండిన పండ్లను ఇప్పుడు తెలుసుకుందాం..
జీడిపప్పు
జీడిపప్పులో అధిక జింక్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు లుటీన్ అలాగే జియాక్సంతిన్ ఉంటుంది. కాగా ఇవి కంటి ఆరోగ్యానికి ముఖ్యంగా అనేక ప్రయోజనాల్ని చేకూర్చుతుంది. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత, ఇతర కంటి పరిస్థితులను నివారించడంలో మేలు చేస్తాయి.
వాల్‌నట్స్..
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇది కళ్లకు రక్త ప్రసరణను మెరుగుపర్చడమే కాకుండా.. వాపును తగ్గిస్తూ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాదం విటమిన్ E సమృద్ధిగా ఉండే బాదం, కళ్లను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తుంది. మాక్యులర్, డీజెనరేషన్ కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కళ్ల తేమను నిర్వహించడానికి.. డ్రై ఐ సిండ్రోమ్‌ను నివారించడానికి తోడ్పడుతాయి.
బాదం..
బాదంలో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. కళ్లను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తుంది. మాక్యులర్ డీజెనరేషన్ అలాగే కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కళ్ల తేమను నిర్వహించడానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పిస్తాపప్పులు..
పిస్తాపప్పులు వాటి లుటీన్.. జియాక్సంతిన్ కంటెంట్ ద్వారా జీడిపప్పుకు సమానమైన ప్రయోజనాలను అందిస్తాయి. అధిక శక్తి కాంతి తరంగాల నుంచి రక్షణను అందిస్తాయి. వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తుంది.
ఎండుద్రాక్ష..
బంగారు రంగు ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A మరియు C ఉంటాయి. ఇవి మొత్తం కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. రాత్రి అంధత్వాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఖర్జూరాలు వాటి లుటిన్ అలాగే విటమిన్ ఎ కంటెంట్ ద్వారా సహజ తీపిని, కంటి ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయి.
ఆప్రికాట్లు..
ఎండిన ఆప్రికాట్లలో విటమిన్ ఎ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది సరైన రెటీనా పనితీరును అలాగే రాత్రి అంధత్వం నివారణకు మేలు చేస్తుంది. వీటిలో బీటా-కెరోటిన్ కూడా ఉంటుంది. ఈ ఎండిన పండ్లు కంటి ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎండిన పండ్లను పచ్చిగా తినడం ఇష్టపడని వారు, వాటి ప్రయోజనాలను పొందడానికి వాటిని వంటకాల్లో చేర్చండి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More..
Summer : సమ్మర్ స్టార్ట్ అయిపోయింది .. ఈ కూరగాయను అధికంగా తీసుకోవాలంటున్న నిపుణులు