summer tips: పెరుగుతోన్న ఎండల నేపథ్యంలో రాగి జావ తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు?

రాగి జావను తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి.

Update: 2025-03-17 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాగి జావను తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మధుమేహానికి చెక్ పెట్టొచ్చు. అధిక బరువును నియంత్రించవచ్చు. రాగి జావలో ఇనుము, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు దట్టంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు.. వృద్ధులకు ఎముకల బలం కోసం రాగి జావ చాలా మంచిది. ఇన్ఫెక్షన్ల నిరోధం రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. ఫైటోన్యూట్రియెంట్స్ శరీరంలో ప్రమాదకరమైన ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.

అలాగే రాగి జావలో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం సమస్యల్ని తొలగించడంలో మేలు చేస్తుంది. రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్‌, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని అదుపులో చేయడంలో సహాయపడతాయి. రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలంగా చెబుతుంటారు నిపుణులు. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో మేలు చేస్తుంది.

రాగి జావలో కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాగి జావలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె అలాగు రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. రాగి జావలో ఉండే ఫైబర్ శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను.. సంతృప్తిని కలిగిస్తుంది. రాగి జావలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.

అయితే రాగి జావ ఎండకాలం తీసుకోవడం మంచిదేనా? అని తాజాగా నిపుణులు వెల్లడించారు. పెరుగుతోన్న ఎండల నేపథ్యంలో రాగి జావ తాగితే.. వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. రాగి జావ తాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుందని పేర్కొంటున్నారు.

రాగిలో ఉండే కాల్షియం, ఫైబర్, ఐరన్, మినరల్స్, అయోడిన్ శరీరానికి అందుతాయని చెబుతున్నారు. కాగా కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే రాగి జావను ప్రతి రోజూ తీసుకుంటే.. ముఖ్యంగా సమ్మర్‌లో తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More..

Dry fruits: సహజంగా కంటి చూపును మెరుగుపర్చే 6 డ్రై ఫ్రూట్స్..? 


High BP: హై బీపీకి అదిరే చిట్కా.. మోదీ కూడా ఇదే ఫాలో అవుతారు.. కేవలం రెండు గంటల్లో రక్తపోటు హాం ఫట్! 

Tags:    

Similar News