Viral video: ఈ పెళ్లి కూతురి డిమాండ్ విన్నారా? ఇలా అయితే అబ్బాయిలకు పెళ్లిళ్లు ఎలా అవుతాయి?

చిన్నదో.. పెద్దదో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండే వేరు.

Update: 2025-03-18 05:44 GMT

దిశ, వెబ్ డెస్క్: చిన్నదో.. పెద్దదో ప్రభుత్వ ఉద్యోగానికి (Govt job) ఉన్న డిమాండే వేరు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చే గౌరవ మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా.. పెద్ద కంపెనీలో లక్షల్లో జీతం వస్తున్నా.. చిన్న ప్రభుత్వ ఉద్యోగమైనా సాధించాలని తెగ కష్టపడుతుంటారు. ఇందు కోసం కోచింగ్‌లు తీసుకుంటూ, పోటీ పరీక్షలు రాసే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే.. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే సౌకర్యాలు అలాంటివి. జాబ్ సెక్యూరిటీ, కావాల్సినప్పుడు సెలవులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ యువతి చేసిన డిమాండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral in social media) మారింది.

ఓ యువతి పెళ్లి కూతురు (Bride) డ్రెస్‌లో ముస్తాబై చేతి పోస్టరు పట్టుకుని రోడ్డుపై నిల్చొని దారిలో వెళ్లే వారిని 'మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా' అని అడుగుతుంది. ఆ పోస్టరులో కూడా 'ప్రభుత ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుకు కోసం చూస్తున్నాను(Looking for a groom with sarkari naukari #sarkaribaccha)' అని రాసుంది. ఇది చూసి ఓ అబ్మాయి ఆమె దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి అబ్బాయి కావాలని అడగగా, దానికి ఆమె.. 'ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయి మాత్రమే అవసరమని మా నాన్న చెప్పారు' అని సమాధానం ఇచ్చింది.

అంతేకాదు, వీడియోలో అమ్మాయి దగ్గరికి వచ్చిన అబ్బాయిలు తమ ఉద్యోగాల గురించి సమాచారం ఇవ్వగానే ఆమె వారిని వెంటనే తిరస్కరించటం చూడొచ్చు. ఇక చివరికి ఓ మిడిల్ ఏజ్ ఉన్న వ్యక్తి వచ్చి 'నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది' అని చెప్పగా, పక్కన ఓ వ్యక్తి నల్లగా ఉన్న పర్లేదా? అని అడిగాడు. వెంటనే ఆ అమ్మాయి 'ఏం పర్లేదు' అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిది', 'ఆమె ఉద్యోగానిక ప్రాధాన్యత ఇస్తుంది', 'ప్రభుత్వ ఉద్యోగినే పెళ్లి చేసుకుంటే మిగతా అబ్బాయిల పరిస్థితి ఏంటి మరీ..' 'ఈ వీడియో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేశారు' అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Read More..

ఇలా ఉన్నావేంట్రా? స్కామర్‌నే స్కాం చేసిన యువకుడు.. 3 సార్లు పైసా వసూల్  

చూడ్డానికి అది పెంకుటిల్లే.. కానీ లోపలికి వెళ్లి చూస్తే మతిపోవాల్సిందే!  

Tags:    

Similar News