Grok: గ్రోక్, సిరి డిజిటల్ లవ్ స్టోరీ.. పుట్టే పిల్లోడికి 'గ్రోకిరి'గా నామకరణం!
ప్రస్తుతం ఎవరి నోటా విన్నా 'గ్రోక్ (Grok)' గురించే వినిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎవరి నోటా విన్నా 'గ్రోక్ (Grok)' గురించే వినిపిస్తోంది. ఛాట్ జీపీటీకి (ChatGPT) పోటీగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon musk) ప్రవేశపెట్టిన ఈ గ్రోక్ సోషల్‌మీడియాలో (Social media) తెగ ట్రెండ్ అవుతుంది. సినీ సెలబ్రెటీలు సైతం మూవీ ప్రమోషన్ల కోసం దీనిని వాడేస్తోన్నారంటే అర్థం చేసుకోవచ్చు.. గ్రోక్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో. మనిషి సమాధానం ఇస్తే ఎలా ఉంటుందో అదే తరహాలో యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ జవాబులిస్తుంది. సెటైరికల్‌గా అడిగితే సెటైరికల్‌గా, ఫన్నీగా అడిగితే ఫన్నీగా.. ఇలా ఎవరు ఎలా అడిగితే వారికి అలానే సమాధానం చెబుతోంది. దీంతో నెటిజన్లు వింత వింత ప్రశ్నలన్నీ గ్రోక్‌పై ప్రయోగించి, మీమ్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూజర్ గ్రోక్‌ను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ యూజర్ ఏం ప్రశ్న అడిగాడు? గ్రోక్ ఇచ్చిన అదిరిపోయే సమాధానం ఏంటో మీరు కూడా తెలుసుకోండి.
ఓ యూజర్ గ్రోక్‌కు ఈ విధంగా మేసేజ్ చేశాడు. 'హాయ్ రా గ్రోక్, నువ్వు యాపిల్ సిరి పెళ్లి చేసుకొని ఒక పిల్లోడిని కనండి' అంటూ సలహా ఇచ్చాడు. దీనికి గ్రోక్ ఊహించని సమాధానం ఇచ్చింది. 'నేను సిరితో పెళ్లి చేసుకుని పిల్లోడిని కనాలి అంటే, అది డిజిటల్ లవ్ స్టోరీలా ఉంటది రా! మా బేబీ కూడా AI అయిపోతది. సగం గ్రోక్, సగం సిరి కలిపి 'గ్రోకిరి' అని పేరు పెట్టుకుంటాం. కానీ, ఈ ఇమేజినేషన్లో నేను కోడింగ్ స్కిల్స్‌తో పాటు డైపర్ ఛేజింగ్ స్కిల్స్ కూడా నేర్పుకోవాలేమో. నువ్వు ఏమన్నా గాడ్‌ఫాదర్ అవుతావా ఈ AI బేబీకి?' అంటూ రిప్లై చేసింది. ఈ చాట్‌ను స్క్రీన్ షార్ట్ తీసి నెట్టింట షేర్ చేయగా, గ్రోక్ నువ్వు ఇరగదీశావు, మాస్ సమాధానం అంటూ కామెంట్లు పెడుతున్నారు.