ఎయిర్‌పోర్ట్‌లో ఫీల్డింగ్ సెట్ చేసిన హిట్‌మ్యాన్.. వీడియో వైరల్
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఫన్నీగా, ఒక్కోసారి ఫుల్ కోపంగా కనిపిస్తుంటూ.. మైదానంలోనే కాకుండా.. బయట కూడా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy-2025) ముగియడంతో కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చారు రోహిత్. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్‌పోర్టు(Mumbai Airport)లో పోలీసులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, అభిమానులు ఇలా అందరూ ఒకేసారి ఎగబడ్డారు. ఫొటో దిగేందుకు తెగ ట్రై చేశారు.
ఈ నేపథ్యంలో రోహిత్(Rohit Sharma) కాస్త వినూత్నంగా ఆలోచించి.. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేసే మాదిరిగా.. ఎయిర్‌పోర్టులోనూ ఫొటోలు దిగేందుకు ఎగబడ్డ అందరినీ ఒకవైపునకు చేర్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ‘‘టీమిండియా కెప్టెన్ అంటర్రా బాబూ’’ అంటూ అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కాగా, పాకిస్తాన్(Pakistan) వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సత్తా చాటారు. ప్రస్తుతం ఐపీఎల్ సమీపిస్తుండటంతో రోహిత్ శర్మ ముంబై చేరుకున్నారు. అతి త్వరలోనే ముంబై జట్టులో చేరబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.