‘‘ఎర్ర ఎర్ర రుమాల్’’ అంటూ గులాబీ బాస్ కేసీఆర్ స్టెప్స్.. (వీడియో)
మీకో ఎక్స్‌క్లూజివ్ ఫన్ డ్యాన్స్ వీడియో గురించి ఫన్‌ఫుల్‌గా చెప్పేస్తున్నాం. ముందుగానే చెప్తున్నాం.. ఇది ఎవరి మనోభావాలను కించపరిచేందుకు కాదు.

దిశ, ఫీచర్స్ : మీకో ఎక్స్‌క్లూజివ్ ఫన్ డ్యాన్స్ వీడియో గురించి ఫన్‌ఫుల్‌గా చెప్పేస్తున్నాం. ముందుగానే చెప్తున్నాం.. ఇది ఎవరి మనోభావాలను కించపరిచేందుకు కాదు. జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి అనుకుంటున్నారు కదా.. అక్కడికే వస్తున్నాం. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించిన ఓ వీడియో నెట్టింట ప్రజెంట్ ట్రెండింగ్‌గా మారింది. ఆయన అభిమానులు కూడా ఈ రీల్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని క్రియేట్ చేసిన క్రియేటర్స్‌కు మంచి టాలెంట్ ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
నాగదుర్గ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘‘ఎర్ర ఎర్ర రుమాల్’’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ప్రతి పెళ్లి, ఫేర్‌వెల్ పార్టీస్‌లో మారుమ్రోగిపోతుంది. ఈవెన్ ఇళ్లలో కూడా ముందుగా ఈ పాట ప్లే చేశాకే నెక్స్ట్ ప్రొగ్రామ్స్ చూస్తున్నారంటే అతిశయోక్తికాదేమో. అయితే ఈ పాటకు నాగదుర్గ డ్యాన్స్ చేస్తే ఓకే.. కానీ మన కేసీఆర్ గారు స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుంది? మనం ఎవరం ఇలా ఆలోచించం కానీ ఓ ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ ఆలోచించాడు. ఎడిటింగ్‌లో ఆయనతో స్టెప్స్ వేయించాడు. యంగ్ ఏజ్‌లో ఉన్న కేసీఆర్ నాగదుర్గ మాదిరిగానే అదిరిపోయే స్టెప్స్ వేశాడు. వావ్ అనిపించేలా.. విజిల్స్ వేసేలా మూవ్స్ చేశాడు. ఈ క్రియేటివిటీకి ఇప్పటికే మస్త్ లైక్స్ వచ్చేయగా.. మరిన్ని ఇలాంటి ఫన్‌ఫుల్ వీడియోస్ షేర్ చేయమంటున్నారు నెటిజన్స్.