Jujube Fruit: ఈ సీజన్ పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఈ సీజన్ పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Update: 2024-12-03 13:27 GMT

దిశ, ఫీచర్స్: రేగిపళ్ల సీజన్ రానే వచ్చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే ఈ రేగిపళ్లు ప్రస్తుతం మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. శీతాకాలం సీజన్‌లో మాత్రమే దొరికే ఈ రేగిపళ్లను తినడం వల్ల చర్మానికి మేలు చేసి, అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ రేగిపళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

రేగిపళ్లతో అందం:

రేగిపళ్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా మొటిమలు లేని అందమైన చర్మాన్ని అందిస్తాయి. అలాగే ఎండబెట్టిన రేగిపళ్లు తినడం వల్ల కాల్షియం, పార్పరస్ శరీరానికి అంది ఎముకలు దృఢంగా మారతాయి. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు రేగిపళ్లు తింటే చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీనితోపాటు చర్మం ముడతలు పడకుండా చూసుకుంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు:

రేగిపళ్లు తినడం వల్ల శరీరానికి చక్కటి పోషకాలు అందుతాయి. మన శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే ఈ రేగిపళ్లు తినడం చాలా అవసరం. కీళ్లకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే మంచిది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రేగిపళ్లు అద్భుత ఆహారం. ఎన్ని రేగి పండ్లు తిన్నా బరువు పెరగరు. మానవ శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో దాదాపు 18 రకాలు ఒక్క రేగి పండులో మాత్రమే దొరుకుతుంది. రేగిపళ్లు తింటే కడుపులో మంట, అజీర్తి, గొంతునొప్పి, కండరాల నొప్పి తగ్గుతాయి.

రేగిపళ్లు తింటే చాలా రోగాలు మన దరిచేరవు. ఎందుకంటే అందులో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి కాబట్టి. అంతేకాదు రేగిపళ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయి తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచివి. విటమిన్ సి, విటమిన్ ఎ లోపం ఉన్నవారికి ఈ పండ్లు మేలు చేస్తాయి.

రేగిపళ్లు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి పంపించడంలో సహాయపడతాయి. వీటి తినడం వల్ల కాలేయం పని తీరు కూడా మెరుగుపరుస్తుంది. అలాగే రేగిపళ్ల వల్ల కాన్సర్ కారకాలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే రేగిపళ్లను ఈ సీజన్‌లో బెస్ట్ ఫ్రూట్‌గా చెబుతుంటారు.

Read More...

Fennel seeds: భోజనం తర్వాతే కాదు.. ఎప్పుడైనా తినవచ్చు..!




Tags:    

Similar News