దిశ, ఫీచర్స్ : ఆందోళన, ఒత్తిడి వేధిస్తున్నాయా? చలికాలంలో ఒళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారా? వీటన్నింటికీ చక్కటి పరిష్కారం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటున్నారు ఫిట్నెస్ అండ్ యోగా నిపుణులు. మానసిక రుగ్మతలే కాదు, శరీరంలో శక్తి స్థాయిలను పెంచడం ద్వారా ఇవి ఆరోగ్య సోపానాలుగా పనిచేస్తాయి. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇంకా ఏయే ప్రయోజనాలు కలిగిస్తాయో ఇప్పుడు చూద్దాం.
*స్ట్రెస్, యాంగ్జైటీస్ తగ్గుతాయి : శ్వాసను లోతుగా పీల్చడం వదలడం వంటి వ్యాయామాలు మెడిటేషన్, యోగాతో ముడిపడి ఉంటాయి. ఇవి ఒత్తిడి ఆందోళనల స్థాయిలను తగ్గిస్తాయి. పారా సింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేయడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. శరీరం, మనస్సును సమతుల్యం చేస్తూ, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి.
* రక్తపోటు తగ్గుతుంది : ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి అధిక రక్తపోటును తగ్గించడంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్లు సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. హృదయ స్పందన వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తాయి.
*లంగ్స్ బలంగా మారుతాయి : బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లతో ఊపిరితిత్తులు బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శ్వాస పీల్చి వదిలే క్రమంలో కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. తద్వారా వాటి పనితీరు మెరుగు పడుతుంది. బాడీకి ఆక్సిజన్‌ను సరఫరా చేసే సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. శ్వాసకోశ అనారోగ్యాలను దూరం చేస్తాయి.
* ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది : బ్రీతింగ్ ఎక్సర్ సైజ్‌లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి శరీర కదలికలకు కారణమై, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే రోగ నిరోధక ప్రతి స్పందనలో కీ రోల్ పోషిస్తాయి. ముఖ్యంగా చలి కాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి.
* మెరుగైన జీర్ణ క్రియ : బ్రీతింగ్ వ్యాయామాలు మెరుగైన జీర్ణ క్రియకు సహాయపడతాయి. శ్వాస పీల్చడం, వదలడం వంటి కారణాలతో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపించడంతోపాటు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. తద్వారా ప్రేగుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
* కండరాలకు విశ్రాంతి : శ్వాస వ్యాయామాలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాదు, కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. దీర్ఘకాలిక నొప్పులు, కండరాల వాపు, తరచుగా కండరాలు పట్టేయడం వంటి ఇబ్బందులను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
*క్వాలిటీ స్లీప్ : బ్రీతింగ్ ఎక్సర్ సైజ్లు ఒత్తిడిని తగ్గించడం ద్వారా పరోక్షంగా క్వాలిటీ స్లీప్‌ను కూడా మెరుగు పరుస్తాయి. కాబట్టి నిద్ర వేళకు ముందు మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటివి ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత చేకూరి అన్ని రకాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోయే అలవాటు ఉందా..? ఇది తెలుసుకోండి!