Skipping: స్కిపింగ్ ఒక్కటి చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

స్కిప్పింగ్ అంటే చాలా మంది చిన్న పిల్లలు ఆడే ఆటని అనుకుంటారు.

Update: 2024-12-04 07:38 GMT

దిశ, ఫీచర్స్: స్కిప్పింగ్ అంటే చాలా మంది చిన్న పిల్లలు ఆడే ఆటని అనుకుంటారు. కానీ, ఇదొక బాడీ వర్కౌట్. స్కిప్పింగ్ చాలా ప్రభావవంతమైన వ్యాయామం. చాలామంది బరువు తగ్గాలనే ఉద్ధేశంతో కష్టమైన వ్యాయామం, ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. పొట్ట తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు, వర్కౌట్స్ చేస్తుంటారు. ఇలా కాకుండా తేలికగా 15 నిమిషాల పాటు ఈ స్కింప్పింగ్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చదివేయండి.

బరువు తగ్గేందుకు: స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలోని జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. దీని వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. భుజాలు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వుతో పాటు శరీరంలోని కండరాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

గుండెకు మంచిది: ప్రతి రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. దీనివల్ల హార్ట్‌కి ఆక్సిజన్ మెరుగ్గా అందుతుంది. హృదయ కండరాలకు, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని అన్నీ భాగాలకు రక్తం, ఆక్సిజన్, పోషకాల సరఫరా బాగా జరుగుతుంది. స్కిప్పింగ్ డైలీ చేయడం వల్ల గుండె వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.

ఒత్తిడిని తగ్గిస్తుంది: స్కిప్పింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. స్కిప్పింగ్ చేసే సమయంలో ఏకాగ్రత మొత్తం తాడు తగలకుండా చేయాలనే ఆలోచనతో ఉంటారు. దీని వల్ల జ్ఞాపకశక్తి మెరుగువుతుంది.

కండరాల బలం: స్కిప్పింగ్ ప్రతి రోజూ చేయడం వల్ల కాళ్లు, చేతులు, తొడ వంటి ఇతర భాగాల్లో కండరాలు దృఢంగా మారుతాయి. శరీరంలోని క్యారీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీని వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది.  

Tags:    

Similar News