Fear also good : భయం..! ఓ విధంగా నయం!!
Fear also good : భయం..! ఓ విధంగా నయం!!
దిశ, ఫీచర్స్ : భయం మానవ అనుభవంలో ఒక అనివార్యమైన అంశం. సాధారణంగా అసహ్యకరమైన లేదా జుగుప్పాకరమైన భావోద్వేగంగా పరిగణించబడుతుంది. యాక్సిడెంట్లు జరిగినప్పుడో, క్రూర మృగాలు కనిపించినప్పుడో, ఒంటరిగా ఉన్నప్పుడో.. ఇలా ఏదో ఒక కారణంతో మనం భయపడుతుంటాం. అలాగే సినిమాల్లోని భయానక సన్నివేశాలను చూసినప్పుడు కూడా భయం వేస్తుంది. మొత్తానికి హాని కలిగిస్తుందని భావించే సందర్భం లేదా సంఘటన మనల్ని సహజంగానే భయపెడుతుంది. ఎందుకిలా? అసలు మనం ఎందుకు భయపడతాం? సైన్స్ ప్రకారం భయం కలిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం? ఆ సమయంలో శరీరంలో ఏం జరుగుతుంది? మెదడులో భయానికి సంబంధించిన ప్రతి స్పందనలు ఎలా ఉంటాయి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో ఏం జరుగుతుంది?
ఒక వ్యక్తి భయపడినప్పుడు లేదా భయాన్ని అనుభవించినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంటే దీనివల్ల మీరు ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతారు లేదా పారిపోతారు? ఈ రెండు కూడా భయం వల్లే కలుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే భయంలోంచి పోరాటం కూడా పుట్టుకొస్తుంది. అలాగే భయాన్ని అనుభవించినప్పుడు బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్స్ పెరుగుతాయి. పరధీయ రక్తనాళాలు సంకోచిస్తాయి. ముఖ్యయమైన అవయవాల చుట్టూ ఉన్న కేంద్ర రక్త నాళాలు ఆక్సిన్, పోషకాలతో నిండిపోతాయి.
భయం రక్షిస్తుంది కూడా
భయం గురించి లోతుగా ఆలోచిస్తే వాస్తవానికి అది పురాతనమైనది. అదొక పరిణామ క్రమం అంటున్నారు నిపుణులు. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవులు వరకు మనిషి సాధించిన విజయాల వెనుక భయం కూడా కీలకపాత్ర పోషించింది. ఒక విధంగా చెప్పాలంటే.. భయం జీవులను రక్షించింది. ఇప్పటికీ రక్షిస్తోంది. ఉదాహరణకు ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి జంతువులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయంటే భయమే కారణం. అలాగే భయం కొన్నిసార్లు సంతోషానికి ప్రేరణగానూ నిలుస్తుంది. ఉదాహరణకు ప్రతికూల వాతావరణంలో మనం ఉన్నట్లయితే.. జంపీగా ఉండటం వెనుక భయమే ముఖ్య కారణం.
కండరాలపై ప్రభావంతో గూస్ బంప్స్
భయం కలిగినప్పుడు కండరాలు కూడా ప్రభావితం అవుతాయి. ఆ సందర్భంలో రక్త ప్రసరణలో వేగం పెరుగుతుంది. శరీరంలోని కండరాలన్నీ రక్తంతో పంప్ చేయబడి భయానక పరిస్థితికి ప్రతి స్పందించడానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే ఒళ్లు గగుర్పొడవడం లేదా గూస్ బంప్స్ సంభవిస్తాయి. అంటే ఈ పరిస్థితిలో మీ శరీరంపై ఉన్న వెంట్రుకల అడుగు భాగంలో కండరాలు బిగుతుగా మారుతాయి. ఇది పైలో రెక్షన్‌కు కారణం అవుతుంది. దీనినే గూస్ బంప్స్ అని పిలుస్తుంటాం. జంతువుల్లోనూ ఇది సంభవిస్తుంది.
గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయ్
మనం భయాన్ని ఎదుర్కొన్నప్పుడు రక్తంలో ఆరోగ్య కరమైన స్థాయిలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో ఇది భయాన్ని ఎదుర్కొనేందుకు శరీరానికి అవసరమైన శక్తిని స్టోర్ చేస్తుంది. అదే విధంగా రక్త ప్రవాహంలో కాల్షియం, తెల్ల రక్త కణాల స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్సాన్స్ అమిగ్డాలలో ప్రారంభం అవుతుంది. ఇది లింబిక్ సిస్టమ్‌లో భాగమైన న్యూరాన్‌ల స్మాల్ బండల్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. భయంతో సహా భావోద్వేగాల ప్రాసెసింగ్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది పిట్యూటరీ గ్రంధిని సక్రియం చేస్తుంది. పిట్యూటరీ గ్రంధి నాడీ వ్యవస్థ ఎండోక్రైన్ లేదా హార్మోన్ వ్యవస్థకు అనుసంధానమై ఉంటుంది. అడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్లను (ACTH) రక్తంలోకి విడుదల చేస్తుంది.
పోరాడేలా ప్రేరేపిస్తుంది
భయం వేసినప్పుడు నాడీ వ్యవస్థ అలర్ట్ అయి అడ్రినల్ గ్రంధిని యాక్టివేట్ చేసేందుకు సహాయపడుతుంది. ఇది రక్త ప్రవాహంలోకి ఎపినెఫ్రైన్ ఎపినెఫ్రైన్ అండ్ ఇతర కేటెకోలమైన్‌లను విడుదల చేసేందుకు ప్రోత్సహిస్తుంది. అలాగే బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ప్రతి స్పందనగా శరీరం కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తపోటు, బ్లడ్ షుగర్, రక్తంలో తెల్ల రక్తణాల పెరుగుదలకు కారణం అవుతుంది. కార్టిసాల్ కొవ్వు ఆమ్లాలను శక్తిగా మార్చి భయాన్ని ఎదుర్కోవడంలో తనవంతు రోల్ పోషిస్తుంది. అలాగే ఎపినెఫ్రైన్ అండ్ నోర్‌పైన్ ఫ్రైన్‌తో సహా కాటెకోలమైన్ హార్మోన్లు రిలీజ్ అయి భయానక పరిస్థితుల్లో మనం పోరాడటానికి లేదా పరుగెత్తడానికి అవసరమైన కదలికలను, కండరాల చర్యలను ప్రేరేపిస్తాయి. హై లెవల్ డెసిషన్స్ తీసుకోవడానికి సహాయపడతాయి.
భయం.. వినోదం కూడా
భయం కొన్ని సందర్భాల్లో వినోదాన్ని కూడా అందిస్తుంది. భయానక చలన చిత్రాలను చూడటం లేదా హాంటెడ్ హౌస్‌లకు వెళ్లడం వంటివి ఇందుకు ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అందరూ భయాన్ని ఆనందిస్తారని చెప్పలేం. మెంటల్లీ సిద్ధమైనప్పుడు ‘థింకింగ్ బ్రెయిన్’ భయం ప్రతి స్పందనను ఆటోమేట్ చేసే ప్రాథమి భాగాలను అధిగమిస్తుంది. అప్పుడు భయం వేయదు. అలాగే మనుషులైనా, జంతువులైనా కొన్నిసార్లు భయం వేయగానే నిశ్చలంగా ఉండిపోతుంటారు. ఆ క్షణంలో ఏం చేయాలో తోచదు. కానీ కాసేపటికి మళ్లీ తేరుకుంటారు. దీనినే ఫ్రీజింగ్ అంటారు. భయానక అనుభవాన్ని నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.
Read More...
నలుగురిలో వారిని చులకన చేయొద్దు..!