Palms: చలి కారణంగా అరచేతులను రుద్దితే ఏం అవుతుందో తెలుసా..?

చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం రెండు అరచేతులను గట్టిగా రుద్దుకుంటారు.

Update: 2024-12-04 10:12 GMT

దిశ, ఫీచర్స్: చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం రెండు అరచేతులను గట్టిగా రుద్దుకుంటారు. ఇలా చేతులను రుద్దడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, చర్మం వేడెక్కుతుంది. కొందరు ఉదయాన్నే నిద్రలేచిన తరువాత రెండు చేతులను రుద్దుకుంటారు. ఇది సాధారణ అలవాటు అని చాలామంది అనుకుంటారు. కానీ, దీని వెనుక రీజన్ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? రెండు అరచేతులను రుద్ది, కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్లకి మేలు కలుగుతుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఆందోళ సమ్యలను తగ్గింస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరచేతులను రుద్దడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చదివేయండి.

రెండు అరచేతులను కలిపి రుద్దడం వల్ల శరీరంలోని రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరానికి శక్తిని, వేడిని కలిగిస్తుంది. అంతేకాకుండా జలుబును దూరం చేయడంలో తోడ్పడుతుంది. ఉదయాన్నే అరచేతులను రుద్దడం వల్ల ఒత్తిడి, టెన్షన్ తగ్గుతాయి. ఇది మెదడుకు ప్రశాంతత, విశ్రాంతిని ఇస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత 2 నిమిషాల పాటు రెండు అరచేతులను రుద్దుతున్న సమయంలో మనస్సు చురుగ్గా మారుతుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది.

ఎప్పుడూ సరే అరచేతులను రెండు నిమిషాల పాటు గట్టిగా రుద్దడం వల్ల హ్యాపీ హర్మోన్లు విడుదల అవుతాయి. దీని కారణంగా మానసిక స్థితి, చిరాకు తగ్గుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లైతే రోజూ నిద్రపోయే ముందు 2 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుందంటున్నారు నిపుణులు. ఇది నాడీవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతీ రోజూ నిద్రపోయే ముందు ఇలా చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించి, బాగా నిద్రపడుతుంది.

అంతేకాకుండా అరచేతులను గట్టిగా రుద్దడం వల్ల వేళ్ల తిమ్మిరి తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేయడం వల్ల బ్రెయిన్‌లో ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీని వల్ల ఒత్తిడి, అలసట దూరమవుతాయి. ఉదయం మాత్రమే కాదు ఎప్పుడైనా సరే రెండు అరచేతులను రుద్ది కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కంటి చుట్టూ రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. కళ్లు అలసిపోయినప్పుడు ఇలా చేయడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Calcium : యువతలోనూ కాల్షియం లోపం.. ఈ సంకేతాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్!






Tags:    

Similar News