ఇలా చేసే మగాళ్లు బెడ్ పైన బిస్కేటే.. మరి అలా చేస్తే, సూపరంట!!
బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్లు బెడ్‌పైన ఎలా ప్రవర్తిస్తారో గుర్తించవచ్చని.. Experts reveal the secrets under the sheets.
దిశ, వెబ్‌డెస్క్ః మనిషి ఆలోచనా తీరును బట్టి కూడా వారి శారీరక సామర్థం, నైపుణ్యాలు ఉంటాయని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఈ క్రమంలోనే ఇటీవల వెలువడిన ఒక అధ్యయనం, ఆయా రకాల మనస్తత్వాలున్న పురుషులు బెడ్‌పైన తన భాగస్వామిని ఎంతగా సంతృప్తి పరచగలరో వెల్లడించింది. దీని కోసం అంగస్తంభన సమస్య ఉన్న 1,740 మంది పురుషులపై జరిపిన అధ్యయనంలో 54 శాతం మంది టైప్ డి పర్సనాలిటీలు ఉన్నారని తేలింది. వీరిని ఆయా ఆలోచనా తీరు, అనుభవాలను బట్టి విభజించారు. ఈ అధ్యయనం నిర్వహించిన సెక్స్‌పర్ట్ అన్నాబెల్లె నైట్, పురుషుల బాడీ లాంగ్వేజ్‌ను బట్టి వాళ్లు బెడ్‌పైన ఎలా ప్రవర్తిస్తారో గుర్తించవచ్చని పేర్కొంది.
బ్యాడ్ ఆన్ బెడ్
రొమాంటిక్ డేట్‌లో ఉన్నప్పుడు తినడం పూర్తి చేయకముందే, బిల్లు తీసుకోడానికి రెడి అయిన వారు బెడ్‌పైన రాణించరంట! జీవితంలో ప్రతి విషయానికీ హడావిడి చేసే వారు.. ముఖ్యంగా, ఆస్వాదించాల్సిన ప్రదేశాల్లో తొందరపెట్టేవారు మంచంపైన కూడా హడావిడిగానే కానిచ్చేస్తారంట!
అలాగే, బయట తినే పదార్థాలు కూడా బెడ్‌పైన సామర్థ్యానికి సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు. బయటకెళ్లిన ప్రతిసారీ తినే మెనూలో సేమ్ ఐటమ్స్ ఉంటే, బెడ్‌రూమ్‌లో కూడా ఇలాంటి వారు ఉత్సాహంగా ఉండే అవకాశాలు తక్కువని స్టడీలో తెలిసింది.
ఏ పనైనా తొందరగా పూర్తి చేశాయాలనుకునే ఫాస్ట్ మూవర్లు కూడా బెడ్‌పైన ఫాస్ట్‌గా కానిచ్చేస్తారంట! సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన లైంగిక జీవితానికి భావోద్వేగ అవగాహన కీలకం కాబట్టి అలాంటి అవగాహన లేకపోతే, విషయంలో గందరగోళానికి గురవక తప్పదంట.
'మొరిగే కుక్క కరవదన్నట్లు', బెడ్‌పైన తాను ఎంత సామర్థ్యాన్ని చూపించగలడో గొప్పగా చెప్పుకునేవారు కూడా చేతల్లో చేతకానివారిగానే మిగిలిపోతారంట!
ఇక, డేట్‌లో ఒకట్రెండు డ్రింక్‌లు తీసుకోవడం సబబే గానీ, పరిమితికి మించి పవర్ చూపించాలనుకునే వాళ్లు పడుకోడం తప్ప ఏమీ చేయలేరంట! ఎందుకంటే, ఆల్కహాల్ అనేది అంగస్తంభన, లైంగిక కోరికల పనితీరుకు దోహదపడుతుందనే వాస్తవాన్ని పక్కన పెడితే, తాగిన నోటికి నోరందించే భాగస్వాములు ఉండటం కష్టమేనంట!
జీవితంలో వైవిధ్యం కోరుకునేవారు కూడా లైంగిక జీవితాన్ని అంతే వైవిధ్యంగా ఎంజాయ్ చేయగలరంట! చివరిగా, రోజువారీ జీవితంలో తక్కువ స్టామినా ఉంటే, బెడ్‌రూమ్‌లోనూ తక్కువ స్టామినాతో సమానం అని అధ్యయనంలో తేలింది.
గ్రేట్ ఆన్ బెడ్
మనిషి మాటల మాంత్రికుడు అయితే, తన సంభాషణలో చూపించే కళ, తనకున్న శ్రద్ధ, అవగాహనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్లు మంచంలో కూడా మాయాజాలం చేసేస్తారంట. ఎవరైనా మీ గురించి శ్రద్ధ వహిస్తూ, మాట్లాడటం, ప్రశ్నల ద్వారా మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటే, మంచంలో కూడా మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలో వాళ్లు అర్థం చేసుకునే అవకాశం ఉంది.
సూటిగా కళ్లలోకి చూసే వారు కోరిక, ఉద్రేకాన్ని ప్రేరేపించడంలో ముందుంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. కాబట్టి, ఐ కాంటాక్ట్ చేసే వారితో డేటింగ్ చేస్తే బెడ్‌పైన స్వర్గం చూపిస్తారంట! ఎందుకంటే, మంచి ఐ కాంటాక్ట్ ఆక్సిటోసిన్ వంటి మంచి అనుభూతిని కలిగించే రసాయనాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని, ఇది మనకు గొప్ప అనుభూతిని కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 'కళ్ళు ఆత్మకు కిటికీలు' కాబట్టి వాటితో మ్యాజిక్ చేయొచ్చని అంటున్నారు.
ఇక, మంచి హాస్యం పండించగలిగినవారు బెడ్‌పైన మంచి అనుభవాన్ని ఇవ్వగలరు. ఎందుకంటే, పడక గదిలో ఇద్దరూ ఎంత సరదాగా నవ్వుకోగలరో అంతే సరదాగా సమయం గడపగలరని నిపుణుల అభిప్రాయం.
ఇక, చివరిగా, స్మూత్ మూచర్లు సూపర్‌గా పర్ఫామెన్స్ చేయగలరంట! అందులోనూ, ముద్దు సహజంగా ఉండాలి. ఎందుకంటే, ముద్దుకు రిహార్సల్ కానీ, ఆదేశాలు కానీ అవసరం లేని సహజమైన చర్య. అందుకే, మీ భాగస్వామికి ఎలా ముద్దు పెట్టుకోవాలో తెలిస్తే, బెడ్‌లో ఏమి చేయాలో కూడా వారికి తెలుసు అని అధ్యయనం వెల్లడించింది.
మీ భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని డౌటా.. ఇలా కనిపెట్టేయండి