సోషల్ మీడియా కంటెంట్‌‌‌‌‌తో స్ట్రెస్‌ లెస్‌‌‌ ఫీల్.. ఎందుకో తెలుసా?

ఆన్‌లైన్‌లో లేదా సోషల్ మీడియాలో చదివే వార్తలను, కంటెంట్‌ను విశ్వసించడంవల్ల టీనేజర్స్‌లో మానసిక ఒత్తిడి తగ్గుతోందని,

Update: 2023-04-16 09:14 GMT

దిశ, ఫీచర్స్: ఆన్‌లైన్‌లో లేదా సోషల్ మీడియాలో చదివే వార్తలను, కంటెంట్‌ను విశ్వసించడంవల్ల టీనేజర్స్‌లో మానసిక ఒత్తిడి తగ్గుతోందని, ఇటువంటి నమ్మకం చాలామంది యువతీ యువకుల్లో సంతోషకరమైన మార్పునకు దారితీస్తోందని కార్నెల్ యూనివర్సిటీ కేంద్రంగా నిర్వహించిన ఒక పరిశధోనలో తేలింది.అయితే ఇంటర్నెట్‌లో చదివేవన్నీ నిజం కానప్పటికీ కేవలం నమ్మకం కారణంగా ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలం నుంచి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.

సందేహాలతో అధిక ఒత్తిడి

టీనేజర్స్ సోషల్ మీడియాను ఫాలో అవుతున్నప్పుడు అందులోని సమాచారం నమ్మదగినదని భావిస్తే వారు మరింత ఎనర్జిటిక్‌గా ఫీలవుతారని, నమ్మకం లేనిదిగా అనపించినప్పుడు వారిలో రకరకాల సందేహాలు తలెత్తడంతో మానసిక ఒత్తిడికి గురవుతారని ప్రధాన పరిశోధకుడు అడమ్ హాఫ్మన్ పేర్కొన్నాడు. ‘సోషల్ మీడియా- మెంటల్ హెల్త్‌’పై గతంలో కూడా పరిశోధనలు జరిగాయి. కానీ అవి మంచి-చెడు ప్రభావాలు ఉంటాయని మిశ్రమ ఫలితాలను కనుగొన్నాయి. కొన్ని అధ్యయనాలు సొంత ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడానికి, సమాజం గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా సహాయపడుతుందని కూడా పేర్కొన్నాయి. మరికొన్ని అధ్యయనాలు ఇతరుల ద్వారా బెదిరింపులు ఎదుర్కోవడం, ఆత్మ న్యూనతా భావానికి గురవడంలో సోషల్ మీడియా ప్రభావం చూపిందని వెల్లడించాయి. తాజా అధ్యయనం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఉంది.

నమ్మకానికి రీజన్ ఇదే..

సోషల్ మీడియాను ఉపయోగించే యువకులపై కొవిడ్ వార్తల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన 4 నుంచి 23 మధ్య వయస్సుగల 168 మంది యువకులను పరిశోధకులు 2020 నుంచి స్టడీ చేశారు. ఈ సమయంలో ప్రపంచం కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొ్ంటోంది. ఆ సందర్భంలో బయటకు వెళ్లలేని పరిస్థితి, భౌతికంగా అందరూ కలుసుకోలేని పరిస్థితి టీనేజర్స్‌ను ఎక్కువగా సోషల్ మీడియా వైపు ఆకర్షించిందని పరిశోధకులు అంటున్నారు. ఆ తర్వాత చాలామంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా వేదికలకు అడాప్ట్ అయ్యారని పేర్కొంటున్నారు. అయితే ఆ కరోనా సమయంలో యువతలో, యూజర్స్‌లో భయాన్ని పోగొట్టేందుకు, జాగ్రత్తగా ఉండేలా చేసేందుకు చాలామంది సోషల్ మీడియాలో వాస్తవాలతో సంబంధం లేని కంటెంట్‌ను కూడా విరివిగా పోస్టు చేశారు. అయినప్పటికీ చాలామంది టీనేజర్స్ తప్పుడు సమాచారాన్ని నమ్మడంవల్ల మానసిక ఒత్తిడికి, ఆందోళనకు దూరమయ్యారని, ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిందని, ఇప్పటి వరకు అది కొనసాగుతోందని అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకుడు అడమ్స్ హాఫ్‌మన్ బృందం పేర్కొన్నది. కానీ సోషల్ మీడియాలో చదివిన ప్రతీ విషయం గుడ్డిగా నమ్మడం కూడా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. నకిలీ కంటెంట్‌ను గుర్తించడానికి ‘ఎడ్యేకేషన్ ప్రోగ్రామ్‌’లను రూపొందించడం, వాటిని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం వంటి అంశాలు ప్రతీ విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలను నమ్మేలా ప్రోత్సహిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. 

Also Read..

లవ్‌ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అమెరికన్లు 36 శాతమేనట.. వన్‌పోల్ సర్వేలో వెల్లడి

Tags:    

Similar News