ఏం చేస్తే మనం కూడా మేధావులం అవుతాం...?
బ్రూస్లీ ఒక మాట అంటాడు.. అదేమంటే... నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద... Special Story
దిశ, వెబ్ డెస్క్: బ్రూస్లీ ఒక మాట అంటాడు.. అదేమంటే... నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద మోస్ట్ డేంజర్ పర్సన్ ఎవరంటే సరిగ్గా వినేవాడు.. సరిగ్గా గమనించేవాడు... ఆ విని గమనించినదానిని లోతుల్లోకి వెళ్లి ఆలోచించేవాడు అని. ఈ మాట ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నానంటే... చాలామంది, మేధావుల గురించి ఆలోచిస్తుంటారు. వారు ఏం చేసి అలా అయ్యారు.. మేం కూడా అలా కావాలంటే ఏం చేయాలి.. ఇలా మేధావులు, ప్రముఖ వ్యక్తుల గురించి ఆలోచిస్తుంటారు. అయితే, వారు ఎలా మేధావులు అయ్యారో.. వారికి ఉన్న లక్షణాలు ఏంటి.. అనేవాటిపైన మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం.
ఇందుకు సంబంధించి ప్రముఖులు చెప్పినదాని ప్రకారం.. అయితే, మనం చరిత్రను ఒకసారి గమనించినట్లయితే, ఈ నాగరికత పుట్టడానికి, మనిషి ఎదగడానికి కారణం ఒకటే. అదేమంటే అతని చుట్టూ ఉన్న నేచర్ ను, వాతావరణాన్ని చాలా శ్రద్ధగా గమనించడం. మీరు ఏ మైధావినైనా తీసుకోండి.. అతనిలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ అబ్జర్వేషన్. అది చుట్టూ ఉన్న మనుషులను కావొచ్చు లేదా సొసైటీని కావొచ్చు. అతను చూడని, గతించని చరిత్ర కావొచ్చు. అతను కులాంకుశంగా గమనిస్తాడు. స్టడీ చేస్తాడు.
ట్రెండ్ సెట్టర్ ను గానీ... లేదా చరిత్రను కులాంకుశంగా మార్చినోళ్లను గానీ... ఇలా ఏ మేధావినైనా తీసుకుని పరిశీలిస్తే.. అప్పటి వరకు ఉన్న చరిత్రను బాగా గమనించి దాన్ని స్టడీ చేసి చివరకు దాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంటారు. దాన్నే ట్రెండ్ సెట్టింగ్ అంటారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప పనుల్లో ఒకటి అంటారు. అందువల్ల మీరేదైనా కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే ముందుగా గమనించడం నేర్చుకోండి. ఇప్పటి వరకు సొసైటీలో ఏముంది... ఏం లేదు.. ఏం కావాలి అనేది మీరు పసిగట్టండి. ఆ తర్వాత దానికి మీరు మీ వద్ద ఉన్న కలను జత చేయండి. అప్పుడది చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. బ్రూస్లీ పని తనాన్ని గమనిస్తే ఆయనలో ఈ క్వాలిటీ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న విద్యను గమనించి స్టడీ చేసి దానికి తన స్టైల్ ను యాడ్ చేశాడు. దీంతో చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక మార్షల్ ఆర్ట్స్ పుట్టుకొచ్చింది.
అందుకే బ్రూస్లీ సింపుల్ గా ఇదే అంటాడు. పనికొచ్చేది గ్రహించు... పనికిరానిది వదిలిపెట్టు. ఆ గ్రహించినదాన్ని నీకు మాత్రమే ప్రత్యేకమైనదాన్ని కలుపు. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైనా సాధించాలన్నా.. సొసైటీని అర్థం చేసుకోవాలన్నా.. చివరకు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలన్నా.. గమనించడం అనేది అతి ముఖ్యమైన పని. ఈ లక్షణం ఆ మేధావుల్లో ఉంటుంది. దీని ద్వారానే వారు చరిత్రలో నిలిచారని ప్రముఖులు చెబుతున్నారు.
Also Read...