Snake like fish: చేప అనుకొని పామును కాల్చుకొని తిన్న పిల్లలు.. తర్వాత ఏం జరిగిందంటే..

తెలిసో తెలియకో మనం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటాం. ఇక పిల్లలైతే అలాంటివి చాలానే చేస్తుంటారు.

Update: 2024-08-14 06:16 GMT

దిశ, ఫీచర్స్ : తెలిసో తెలియకో మనం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటాం. తర్వాత అసలు విషయం గుర్తించి ఆశ్చర్యపోతుంటాం. ఇక పిల్లలైతే అలాంటివి చాలానే చేస్తుంటారు. ప్రస్తుతం అటువంటి సంఘటనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇద్దరు పిల్లలు చేప అనుకొని పామును పట్టుకొచ్చి కాల్చుకుని తిన్నారు. అసలు ఏం జరిగిందంటే..

నిజానికి చేపలు, పాములు వేర్వేరు ఆకారాల్లో ఉంటాయి. వాటిని గుర్తు పట్టడం కూడా సులువే. అయితే అరుదుగా కొన్ని చేపలు సేమ్ టు సేమ్ పాముల మాదిరే ఉంటాయట. కాబట్టి వెంటనే గుర్తు పట్టడం కష్టం. తాజాగా ఉత్తరా‌ఖండ్‌లోని నైనితాల్ జిల్లాలో, రామ్‌నగర్ పుచ్చడి నాయి అనే గ్రామంలో అదే జరిగింది. ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ఎనిమిది, పది ఏండ్ల వయస్సుగల ఇద్దరు బాలురు సరదాగా ఆడుకుంటూ ఉండగా దగ్గరలోని ఓ గుంతలో చనిపోయిన ఓ పాము కనిపించింది. అయితే అది చేప మాదిరి ఉండటంతో పిల్లలు కూడా అదే అనుకొని ఇంటికి తీసుకొచ్చి నిప్పుల్లో కాల్చుకుని తినడం ప్రారంభించారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఆ పిల్లల తల్లి వారు తింటున్నది పాము అని గుర్తించింది. కానీ అప్పటికే వారు సగం తినేశారు. దీంతో కంగారు పడిన ఆమె వెంటనే దగ్గరలోని పాముల సంరక్షకుడి వద్దకు వారిని తీసుకెళ్లింది.

పిల్లలు పామును కాల్చుకుని తిన్నారని తెలుసుకున్న పాముల సంరక్షకుడు వారికి పాము విషానికి విరుగుడుగా పనిచేసే మూలికలు ఇచ్చాడు. ఆ తర్వాత వారు తిన్న పామును కూడా పరిశీలించగా అది విషపూరితమైంది కాదని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలు కూడా సేఫ్‌గానే ఉన్నారు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాము తిన్నారని తెలిశాక హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా.. మూలికల వైద్యుడి వద్దకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. విషపూరితమైన పాము కాదు కాబట్టి పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారని, లేకుంటే ఘోరం జరిగేదని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. 

Read More.. 

KING COBRA: పాములు ఒకదానినొకటి ఎందుకు తింటాయి? 

Tags:    

Similar News