Smart phone alert : ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఆ పని చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

Smart phone alert : ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఆ పని చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

Update: 2024-10-25 06:13 GMT

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో దాదాపు అందరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రోజువారి అవసరాల్లో అదో భాగమై పోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు యూజ్ చేస్తున్నారు. అయితే కొంతమంది వినియోగించే క్రమంలో ఫోన్ కవర్ వెనుక భాగంలో ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, డబ్బులు, వివిధ స్లిప్పులు వంటివి పెడుతుంటారు. ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ మధ్య స్మార్ట్‌ఫోన్లు పేలుతున్న సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాల్లో స్మార్ట్ ఫోన్ వెనుక కవర్‌లో డబ్బులు, వస్తువులు పెట్టడం కూడా ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

* స్మార్ట్ ఫోన్ వెనుక కవర్‌లో డబ్బులు, ఏటీఎం, ఆధార్ కార్డు, ఇతర వస్తువులు వంటివి పెట్టినప్పుడు బయట గాలిలోని తేమ స్మార్ట్‌ఫోన్‌ను చల్లబర్చే అవకాశం ఉండదు. దీంతో ఫోన్ మరింత వేడెక్కుతుంది. అలాగే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడో, చార్జింగ్ పెట్టినప్పుడో పేలిపోయే చాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి తగిన కేర్ తీసుకోవాలి.

* కొందరు ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు రకరకాల చార్జర్లు వాడుతుంటారు. ఇది సేఫ్ కాదంటున్నారు నిపుణులు. మీ మొబైల్ ఏ కంపెనీదో, చార్జర్ కూడా అదే వాడటం బెటర్. మార్కెట్లో తక్కువ ధరకు వస్తు్న్నాయని సంబంధం లేని చార్జర్లు ఫోన్ పేలిపోవచ్చు.

*అలాగే ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంచినప్పుడు ఛాటింగ్ చేయడం గానీ, ఫోన్ మాట్లాడటం కానీ అస్సలు చేయవద్దు. ఇలా చేస్తే బ్యాటరీ మరింత వేడెక్కుతుంది. చార్జింగ్ పెట్టి ఉన్నందున విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మీరు ఫోన్ మాట్లాడటం, స్ర్కోల్ చేయడం వంటివి చేయకండి.

*ఫోన్ తరచూ వేడెక్కడం గుర్తిస్తే దానిని వాడటం ఆపి వేయండి. వెంటనే సర్వీసింగ్ చేయించండి. అలా కాకుండా వేడెక్కడం సహజమే అనుకొని వాడేస్తూ ఉంటే ప్రమాదంలో పడవచ్చు. ఇక కారులో వెళ్తు్న్నప్పుడు ఫోన్ వేడిగా ఉన్నా, వాతావరణం వేడిగా ఉన్నా చార్జింగ్ పెట్టకండి. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెదర్ నార్మల్‌గా ఉంటేనే చార్జింగ్ పెట్టండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్మార్ట్‌‌ఫోన్ యూజర్లకు ఎలాంటి రిస్క్ ఉండదు అంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News