పరిపూర్ణ బంధానికి ఆరు సూత్రాలు.. వీటిని ఫాలో అయితే ఎన్ని లాభాలో..

ఎప్పుడూ కలిసి ఉండటం, స్పెషల్ ఈవెంట్స్ జరుపుకోవడం, నచ్చిన ప్రదేశాలను చుట్టేసి రావడం, రొమాంటిక్ డేట్స్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం.

Update: 2024-05-31 13:00 GMT

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ కలిసి ఉండటం, స్పెషల్ ఈవెంట్స్ జరుపుకోవడం, నచ్చిన ప్రదేశాలను చుట్టేసి రావడం, రొమాంటిక్ డేట్స్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం.. ఇవి మాత్రమే పరిపూర్ణ బంధానికి నిదర్శనంగా కొందరు భ్రమ పడుతుంటారు. కానీ వాస్తవం కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ.. అవసరమైనప్పుడు సర్దుకుపోతూ ఉంటమే.. పర్‌ఫెక్ట్ రిలేషన్‌షిప్‌కి అద్దం పడుతుందని చెప్తున్నారు. ఇలాంటి బంధాలే కలకాలం నిలుస్తాయని పేర్కొంటున్నారు.

మంత్లీ వన్స్ అయినా..

సంబంధాల్లో ఎలాంటి అపోహలకు తావులేకుండా పార్టనర్స్ మధ్య మంచి కమ్యూనికేట్ ఉండాలి. అది లేనప్పుడు అనవసర విషయాలన్నీ ముందుకు వచ్చి.. ఇద్దరి మధ్య దూరం పెరగుతుంది. చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా మారుతాయి. అందుకే కనీసం వీక్లీ లేదా మంత్లీ వన్స్ అయినా మీ రిలేషన్‌షిప్ ఎలా ఉందనే విషయాలను గుర్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓపెన్ కమ్యూనికేట్‌తో ఎటువంటి ఇబ్బందులనైనా అధిగమించి బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చునని చెప్తున్నారు

సవాళ్లను అధిగమించండిలా..

రిలేషన్‌షిప్‌లో అనేక సమస్యలు, సవాళ్లు కూడా ఎదురవుతుంటాయి. కొందరు తాము మాత్రమే ఇబ్బంది పడుతున్నామని భావిస్తుంటారు కానీ ఇది నిజం కాదు. పైగా వ్యక్తిగత, సామాజిక పరిస్థితుల నడుము ఎదురయ్యే సవాళ్లను మనసులోనే పెట్టుకొని బాధపడటం కంటే ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ లేదా నమ్మకస్తులైన ఫ్రెండ్స్‌తో డిస్కషన్ చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు దూరం అవుతాయి. వర్క్-రిలేటెడ్ స్ట్రెస్ గురించి అయితే కొలీగ్స్‌తో చర్చించడం, సలహాలు తీసుకోవడం చేయవచ్చు.

భావోద్వేగ శ్రేయస్సు ముఖ్యం

బంధం బలంగా ఉండటానికి భార్యా భర్తల మధ్య శారీరక, మానసిక సంబంధాలు ముఖ్యమే. కానీ వీటితోపాటు భావోద్వేగా శ్రేయస్సు కూడా ఇంపార్టెంట్. అందుకే తమ భాగస్వామి మానసిక స్థితిని తెలిసి మసలు కోవాలి. ఇబ్బంది కరపరిస్థితుల్లో, అలాగే బాధాకరమైన పరిస్థితుల్లో కూడా భార్య లేదా భర్త ఎలా ఫీలవుతున్నారో అర్థం చేసుకొని, తెలుసుకొని అండగా నిలువాలి. భావోద్వేగ మద్దతు అందించాలి. ఇది రిలేషన్‌షిప్‌ను మరింత స్ట్రాంగ్ చేస్తుంది.

సందర్భోచిత ప్రశంసలు

రిలేషన్‌షిప్ జర్నీలో మరో ముఖ్యమైన విషయం సందర్భాన్ని బట్టి భాగస్వామిని ప్రశంసించడం, ప్రోత్సహించడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ప్రశంస ఒక మెడిసిన్‌లా పనిచేస్తుందట. పైగా ప్రతీ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో తాను ప్రశంసించబడాలనే కుతూహలం, ఆసక్తి కలిగి ఉంటారు. పార్టనర్స్ మధ్య ప్రశంసలు వారి బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞతా భావంతో మెలిగేలా దోహదం చేస్తాయి.

ఫ్యూచర్ ప్లాన్, ప్రాబ్లం సాల్వింగ్

ప్రతీ జంటకు ఇది చాలా ముఖ్యం. మెరుగైన భవిష్యత్తు గురించి తగిన ప్రణాళిక కలిగి ఉండాలి. అందుకోసం ఏం చేయాలనేది కలిసి మాట్లాడుకోవచ్చు. సంపాదన ఎలా ఖర్చు పెట్టాలి. ఎందులో పెట్టుబడి పెట్టాలి. ఎలా ఉపయోగించుకోవాలి. పిల్లలకోసం ఏం చేయాలి ఇలా ప్రతీ విషయంలో ఓ క్లారిటీతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి. వాటిని అమలు చేయడంలో పరస్పరం సపోర్టుగా ఉండాలి. అలాగే ఓపెన్, అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్, శ్రద్ధగా వినడం, అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ప్రాబ్లం సాల్వింగ్ అంశాలకు ప్రయారిటీ ఇవ్వాలి.

ఇంపార్టెన్స్ గుర్తించండి

కపుల్స్ సరదాలు, సంతోషాలు, బాధ్యతలతోపాటు వాటి ఇంపార్టెన్స్‌ను గుర్తించాలి. ఏ సందర్భాలు తమకు ఎంత ముఖ్యమో ఓ అంచనాకు వస్తే వాటి నిర్వహణ సులువు అవుతుంది. పిల్లలతో కలిసి పార్కుకు వెళ్లడం, వారి చదువు కోసం డబ్బు ఆదా చేయడం, కుటుంబ అవసరాలు, ఆరోగ్యాల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి కూడా భార్యా భర్తల బంధానికే కాకుండా వారి కుటుంబ శ్రేయస్సుకు, పిల్లల భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఇవన్నీ ఫాలో అయితే సంబంధాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఈజీగా అధిగమించవచ్చు.


Similar News