అప్పట్లో గుంజీళ్ల పనిష్మెంట్ ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగా (వీడియో)
క్లాసులు అటెండ్ అయ్యి మరీ గుంజీళ్లు తీస్తున్నారు. School's punishment of old days, discovered as Super Brain Yoga
దిశ, వెబ్‌డెస్క్ః ఇప్పుడంటే స్కూళ్లల్లో కార్పొరల్ పనిష్మెంట్లు తప్పుగా మారాయి కానీ, ఒకప్పుడు స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు తప్పు చేస్తే గుంజీళ్ల పనిష్మెంట్ తప్పనిసరిగా ఉండేది. తప్పుచేసిన స్థాయిని బట్టి కొన్ని సార్లు 100 గుంజీల్లు కూడా తీయాల్సి వచ్చేది. కాలం మారింది, ప్రయివేటు విద్యాసంస్థలు వేలు దాటి, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంత డబ్బు తీసుకొని, మళ్లీ పిల్లలకి పనిష్మెంట్లంటే తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు. అయితే, ఇప్పుడు గుంజీళ్లే పిల్లల మెదడు ఆరోగ్యానికి అత్యవసరంగా భావిస్తున్నారు కొందరు. విదేశాల్లో మానసిక వికలాంగులకు సైతం గుంజీళ్లతోనే ట్రీట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. గుంజీళ్లకు సూపర్ బ్రెయిన్ యోగా అని పేరు పెట్టి క్లాసులు అటెండ్ అయ్యి మరీ గుంజీళ్లు తీస్తున్నారు. పరీక్ జైన్ అనే ట్విట్టర్ ఖాతాదారు షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఔరా.. నిజమా..! అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.
Super Brain Yoga - Indian school's punishment of old days now discovered as super brain yoga.#EIIRInteresting #yoga
— Pareekh Jain (@pareekhjain) September 1, 2022
Credit: CBS2 News, ViaWeb pic.twitter.com/bjyQWahOVX