గొంతు నొప్పి ఎక్కువ అవుతుందా? ఒక్కసారి ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయండి..
వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గొంతు నొప్పి రావడం సాధారణం. పొడి గాలి లేదా పొగ వంటి పర్యావరణ కారకాలు.. ధూమపానం వల్ల కూడా ఇది సంభవించవచ్చు.
దిశ, ఫీచర్స్: వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గొంతు నొప్పి రావడం సాధారణం. పొడి గాలి లేదా పొగ వంటి పర్యావరణ కారకాలు.. ధూమపానం వల్ల కూడా ఇది సంభవించవచ్చు. దీంతో మంట, చికాకు, నొప్పి, మింగడంలో అసౌకర్యాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఐస్‌క్రీమ్ తింటే మరింత పెయిన్ కలుగుతుందని పెద్దలు భావిస్తారు. కానీ ఇది థ్రోట్ పెయిన్‌కు విరుగుడుగా పనిచేస్తుందని, తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుందని చెప్తున్నారు నిపుణులు. చల్లని ఉష్ణోగ్రత గొంతు మొద్దుబారడానికి సహాయపడుతూ.. నొప్పి, వాపును తగ్గిస్తుంది.
అయితే ఐస్‌క్రీమ్‌ను చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. సిట్రస్ లేదా చాక్లెట్ వంటి స్ట్రాంగ్ యాసిడ్ రుచులు చికాకును పెంచుతాయి. కాబట్టి తక్కువ క్రీమ్‌తో ఉండే వెనీలా బెటర్ అని చెప్తున్నారు. సున్నితమైన గొంతును మరింత చికాకు పెట్టే నట్స్, క్రంచీ బిట్స్ వంటి మిక్స్-ఇన్‌లతో కూడినవి నివారించాలని అంటున్నారు. అయితే ఐస్‌క్రీమ్ గొంతు నొప్పికి సంతోషకరమైన ఉపశమనాన్ని అందిస్తుంది కానీ పూర్తిగా నివారించదని అంటున్న నిపుణులు.. ఎఫెక్టివ్ టిప్స్ అందిస్తున్నారు.
• గొంతును తేమగా ఉంచడానికి గోరువెచ్చని నీరు, హెర్బల్ టీ లేదా సూప్స్ ఎక్కువగా తీసుకోండి.
• ఒక టీస్పూన్ ఉప్పును గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలించండి.
• పొడి వాతావరణం లేదా వేడిగా ఉన్న ఇండోర్ ప్రదేశాలలో.. హ్యూమిడిఫైయర్‌తో గాలికి తేమను జోడించడం వల్ల గొంతు ఎండిపోకుండా నిరోధించవచ్చు.
• మాట్లాడటం, పాడటం లేదా గుసగుసలాడటం పరిమితం చేయడం ద్వారా స్వర తంతువులకు విరామం ఇవ్వండి.
• లక్షణాలను తగ్గించడానికి థ్రోట్ స్ప్రేస్ లేదా పెయిన్ రిలీవర్స్‌ను ఉపయోగించండి. కానీ సిఫార్సు చేయబడిన మోతాదులను అనుసరించండి.