కఠిన వ్యాయామంతో ఇమ్యూనిటీ పవర్‌పై తీవ్ర ప్రభావం

ఫిట్‌నెస్ కోసం చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే కానీ కఠిన వ్యాయామం రోగనిరోధక వ్యవస్ధను అణిచివేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది.

Update: 2023-11-23 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫిట్‌నెస్ కోసం చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే కానీ కఠిన వ్యాయామం రోగనిరోధక వ్యవస్ధను అణిచివేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బందిలో వ్యాయామం అనంతరం 4700 ఫ్లూయిడ్ అణువులను విశ్లేషించిన తర్వాత జర్నల్ మిలటరీ మెడికల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించడం జరిగింది. అధిక ఫిట్‌నెస్ లెవెల్స్ కలిగిన వ్యక్తులు కఠిన వ్యాయామం చేసిన తర్వాత వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉందని.. పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబరేటరీకి చెందిన బయోమెడికల్ సైంటిస్ట్ ఎర్నెస్టో నకయసు వెల్లడించారు.

ఇది రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందనేందుకు ఆధారాలున్నాయని చెబుతున్నారు. కఠిన వ్యాయామం అనంతరం ఇమ్య్యూనిటీ పవర్‌పై తక్షణమే ప్రతికూల ప్రభావం ఉంటుందనే విషయం ప్రస్తుతం వర్కర్లు, అథ్లెట్లు వంటి కఠిన వ్యాయామ శిక్షణ అవసరమైన వృత్తుల్లో ఉన్న వ్యక్తులకు ఈ అధ్యయనంలో వెలువడిన వివరాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.

నకయసు.. ఆయన తోటి పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో భాగంగా 11 మంది అగ్నిమాపక సిబ్బంది కఠిన వ్యాయామం చేసే ముందు.. తర్వాత వారి బ్లడ్ ప్లాస్మా, యూరిన్‌, సలీవాను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చాలా వరకు వారి రోగనిరోధక వ్యవస్ధపై ప్రభావం చూపినట్లు గుర్తించారు. ఫైర్ ఫైటర్స్ ద్రవాలు, ఆక్సిజన్‌, ఎనర్జీ స్థాయిలతో పాటు వాపుకు సంబంధిత అణువుల్లో తగ్గుదలను కనుగొన్నారు. అయితే శాంపిల్ సైజ్ తక్కువగా ఉండటం, అగ్నిమాపక సిబ్బంది కాలుష్య వాతావరణంలో పనిచేయడం వంటి కారణాలతో అత్యధికులపై అధ్యయనం చేపట్టాలనే వాదన వినిపిస్తోంది.

Tags:    

Similar News