పెళ్లైన తర్వాత పురుషుల పొట్ట పెరగడానికి కారణాలు..?

చాలా మంది పురుషులకు వివాహం అనంతరం పొట్ట వస్తుంటుంది.

Update: 2025-03-14 14:16 GMT
పెళ్లైన తర్వాత పురుషుల పొట్ట పెరగడానికి కారణాలు..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది పురుషులకు వివాహం అనంతరం పొట్ట వస్తుంటుంది. కేవలం పొట్ట పెరగడమే కాకుండా.. ఊబకాయం సమస్య బారిన పడుతారని నిపుణులు చెబుతుంటారు. బెల్లీ ఫ్యాట్ తో కూడా ఇబ్బందిపడుతుంటారు. మరీ పెళ్లి తర్వాత పొట్ట ఎందుకు పెరుగుతుందో.. తాజాగా నిపుణులు వివరించారు.

పోలాండ్‌లోని ఒక అధ్యయనంలో వెల్లడైన తీరు చూసినట్లైతే.. పెళ్లి కాని పురుషులతో పోల్చి చూస్తే వివాహం అయిన వారిలో 62 శాతం ఊబకాయం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే వివాహం అయిన మహిళల్లో 39 శాతం మంది అధిక బరువు ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు.

మరీ పెళ్లి అయిన తర్వాత పురుషులకు పొట్ట రావడానికి కారణాలు చూసినట్లైతే.. వివాహనంతరం వారికి తెలియకుండానే ఫుడ్ ఎక్కువగా తింటుంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే శారీరక శ్రమ తగ్గుతుంది. ఇంటి పనులు ఎక్కువగా భార్యలు చూసుకుంటారు. కాగా పనిబారం తగ్గుతుంది. వారు కుర్చున్న దగ్గరికే ఆడవాళ్లు అన్ని తెచ్చి పెడుతారు.

కాగా వారికి తెలియకుండానే వెయిట్ పెరుగుతుంటారు. నిజానికి పెళ్లి అనంతరం పురుషుల లైఫ్‌స్టైల్ మొత్తం ఛేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ వివాహనంతరం కూడా మగాళ్లు భార్యలకు ఇంటిపనుల్లో సాయం చేయాలి. తద్వారా వారు బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

READ MORE ....

పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఆ పార్ట్ కట్ చేసుకోవాల్సిందే.. షాక్ ఇస్తున్న వింత ఆచారం.. కానీ అది లేకుండా ఎలాగండి.....


Tags:    

Similar News