Foods : వింటర్‌లో డల్‌నెస్ పెరిగిందా..? మీలో ఉత్సాహం నింపే ఫుడ్స్ ఇవే..
దిశ, ఫీచర్స్ : చలికాలంలో వాతావరణ మార్పులు మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంటాయి. కూల్ వెదర్ కారణంగా ఉదయాన్నే లేవడానికి చాలామంది ఇష్టపడరు. దీంతో ఎండలో గడిపే అవకాశం ఉండదు. ఫలితంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. వ్యాయామాలకు కూడా కొందరు దూరంగా ఉండటంవల్ల బద్ధకం లేదా డల్‌నెస్ పెరిగిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మూడ్ స్వింగ్స్ పెరిగిపోయి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడటంలో కొన్ని రకాల ఆహారాలు సహాయపడతాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.
విటమిన్లు, మినరల్స్
వింటర్‌లో మీలో డల్‌నెస్ పోయి ఉత్సాహంగా ఉండాలంటే తగిన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. అయితే ఇవి వాల్‌నట్స్, జీడిపప్పు, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే సెరోటోనిన్ హార్మోన్ విడుదలను ప్రోత్సహిస్తాయి. ఫలితంగా డల్‌నెస్ లేదా బద్ధకం వంటివి దూరం అవుతాయి. ఫ్లేవనాయిడ్స్ పాలీఫెనోల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి డార్క్ చాక్లెట్ కూడా అందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఫైబర్, విటమిన్ బి6
ఫైబర్ కంటెంట్, విటమిన్ బి6 సహా ఇతర విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు కలిగిన ఆహారాలు మీలో యాక్టివ్ నెస్ పెంచుతాయి. ప్రతీ సీజన్‌లో అందుబాటులో ఉంటున్న అరటి పండ్లలో ఇవి పుష్కలంగా లభిస్తాయి. అలాగే కొవ్వు చేపలు, ఓట్స్‌లో బద్ధకాన్ని దూరం చేసే పోషకాలు ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడంవల్ల మీలో ఫీల్ గుడ్ హార్మోన్లు అయిన డోపమైన్, అలాగే సెరోటోనిన్ ఉత్పత్తి అవుతాయి. మీరు సంతోషంగా ఉండటంలో ఇవి సహాయపడతాయి. అలాగే సాల్మన్ చేపల్లో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి. స్ట్రా బెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రేగిపళ్లు కూడా డల్‌నెస్ పోగొట్టే పోషకాలకు నిలయం. వీటితోపాటు సీజనల్‌గా లభించే అన్ని రకాల ఆకుకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడంవల్ల తగిన పోషకాలు లభిస్తాయి. బద్ధకాన్ని తొలగించడంలో సహాయపడతాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.