వామ్మో.. ఈ కీటకం యమ డేంజర్ గురూ! వేటాడాల‌ని చూస్తే బాంబులేస్తుంది!

సీతాకోక చిలుకలు, తేనెటీగలు, కందిరీగలు, ఈగలు, చీమలు.. ఇలా భూమిపై అనేక రకాల జాతి కీటకాలున్నాయి.

Update: 2025-03-26 05:18 GMT
వామ్మో.. ఈ కీటకం యమ డేంజర్ గురూ! వేటాడాల‌ని చూస్తే బాంబులేస్తుంది!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సీతాకోక చిలుకలు, తేనెటీగలు, కందిరీగలు, ఈగలు, చీమలు.. ఇలా భూమిపై అనేక రకాల జాతి కీటకాలున్నాయి. ఇందులో ప్రమాదకరమైన కీటక జాతులు కూడా ఉన్నాయి. స్వీయ రక్షణలో అవి తమ విషాన్ని వదిలి ప్రాణాలను కాపాడుకుంటాయని మనకి తెలుసు. కానీ, ఇప్పుడు చెప్పబోయే కీటకం గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. దీని జోలికి ఎవరైనా వస్తే ఏకంగా బాంబులేస్తుంది. అది కూడా నార్మల్ బాంబులు కాదు, యాసిడ్ బాంబుల వర్షం కురిపిస్తుంది. నిజమేనండి.. ఈ కీటకం పేరు 'బాంబార్డియర్ బీటిల్ (Bombardier beetle)'. షాకింగ్‌గా అనిపించే ఈ కీటకం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

బాంబార్డియర్ బీటిల్.. అంటార్కిటికా మినహా భూమిపై ఉన్న అన్ని ఖండాల్లో ఇది కనిపిస్తుంది. ఇందులో దాదాపు 500 జాతులు ఉన్నాయి. ఇక ఈ కీటకం శ‌రీరంపై పెంకులాంటి నిర్మాణం ఉంటుంది. అలాగే, ఇవి గాల్లో ఎగరలేవు. బాంబార్డియర్ బీటిల్ శరీరంలో రెండు వేర్వేరు గ్రంథుల నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులు విడుదల అవుతాయి. ఇవి రెండు కలిసి దీని కడుపులో అతి ప్రమాదకరమైన బెంజోక్వినోన్‌గా మారుతుంది. ఏవైనా ఇతర జీవులు దీనిపై దాడిచేసేందుకు వ‌చ్చిన‌ప్పుడు.. త‌న‌ను తాను ర‌క్షించేందుకు ఈ ర‌సాయ‌న బాంబుల‌ను వ‌దులుతుంది. వీటి కారణంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడ‌డానికి సాహసించదు.

ఈ డేంజరస్‌ బీటిల్‌ ఒకేసారి 20 సార్లు ఈ రసాయనిక వాయువులను విడుద‌ల చేస్తుంది. అవి వాతావరణంలోని ఉష్ణోగ్రతతో కలిసిపోయి బాంబుల్లాగా పాప్ అనే శ‌బ్ధం చేస్తూ విడుదలవుతాయి. ఇది ఇత‌ర జీవుల‌కు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే దీనిపై దాడి చేసేందుకు ఇతర జీవులు వెనక్కు జంకుతాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను నెట్టింట షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏకే 47 కంటే డేంజరస్ ఉంది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News