IPL 2025 : ఐపీల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న మాక్స్ వెల్

ఐపీఎల్(IPL) లో అత్యంత చెత్త రికార్డు(Worst Record) నమోదైంది.

Update: 2025-03-25 16:08 GMT
IPL 2025 : ఐపీల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న మాక్స్ వెల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL) లో అత్యంత చెత్త రికార్డు(Worst Record) నమోదైంది. పంజాబ్ కింగ్స్(PBKS) ఆటగాడు గ్లెన్ జేమ్స్ మాక్స్‌వెల్(Glenn James Maxwell) పై ఈ రికార్డు నమోదు అయింది. ఐపీఎల్ మెగా టోర్నీలో అత్యధికంగా సున్నా పరుగుల(Zero Score)తో ఔటైన ఘనతను మాక్స్ మూటగట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో మాక్స్ వెల్ 19 సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఇలా సున్నా స్కోర్ చేసిన వారిలో తదుపరి వరుసలో ఉన్నవారు రోహిత్ శర్మ(Rohith Sharma) 18, దినేష్ కార్తీక్(Dinesh Karthik) 18, పీయూష్ చావ్లా 16, సునీల్ నరెన్ ఉన్నారు. కాగా మంగళవారం అహ్మదాబాద్ లో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్(PBKS vs GT) లో మాక్స్ మరోసారి LBW అవడంతో సున్నా స్కోర్ రికార్డ్ నమోదు చేశాడు. కాగా ఈ వ్యవహారంపై మాక్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.  

Tags:    

Similar News