viral: స్కూటీని ఢీకొట్టి 15 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో
అతివేగంగా వెళ్తున్న కారు.. ఓ స్కూటీని ఢీకొట్టి దాదాపు 15 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళింది.

దిశ, వెబ్‌డెస్క్: అతివేగంగా వెళ్తున్న కారు.. ఓ స్కూటీని ఢీకొట్టి దాదాపు 15 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళింది. ఈ ఘోరమైన సంఘటనల లక్నో (Lucknow)లోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీద్ పథ్ రహదారి (Shaheed Path Road)పై చోటుచేసుకుంది. ఒక వేగంగా వచ్చిన SUV కారు, స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. SUV డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా స్కూటీని 15 కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లాడు.
ఈ క్రమంలో స్కూటీ రహదారిపై ఈడ్చుకెళ్లడం (Dragging) వల్ల నిప్పులు చెలరేగాయి. దీన్ని రహదారిపై ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video went viral on social media)గా మారింది. ఈ ఘటనపై బాదితులు.. కారు డ్రైవర్ బ్రిజేష్ సింగ్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తి ఒక ఇంజనీర్ పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి గురించి ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.